ఈ-రిక్షాలు పంపిణీ చేసిన బాలీవుడ్ నటుడు సోనూసూద్
- February 13, 2021
ముంబై:బాలీవుడ్ నటుడు సోనూ సూద్ తన స్వస్థలమైన పంజాబ్లోని మోగా పట్టణంలో ఎనిమిది మంది నిరుద్యోగులకు ఎలక్ట్రిక్ రిక్షాలు (ఈరిక్షా) అందించాడు.ఈ సందర్భంగా సోనూ మాట్లాడుతూ..భారత దేశవ్యాప్తంగా 150 ఈరిక్షాలు పంచాలని నిర్ణయించుకున్నానని, ఫలితంగా కొంతమందికైనా ఉపాధి దొరుకుతుందని పేర్కొన్నాడు.
సాయం చేయగలిగే స్థితిలో ఉండే ప్రతి ఒక్కరు అవసరమైన వారికి తోచినంత సాయం చేయాలని పిలుపునిచ్చాడు.తనకు సేవాగుణం అలవడడానికి తన తల్లిదండ్రులే కారణమన్నాడు. అవసరమైన వారికి సాయం చేస్తూ అందరిలానే తన బాధ్యతను నిర్వర్తిస్తున్నట్టు సోనూ చెప్పుకొచ్చాడు.ఈ కార్యక్రమంలో ఆయన సోదరి మాళవిక సచార్, బావ గౌతమ్ సచార్ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







