కుంభ సందేశ్ యాత్రను ప్రారంభించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
- February 19, 2021
హైదరాబాద్:భారతదేశ సంస్కృతీ, సాంప్రదాయాలు ప్రపంచానికే మార్గదర్శకంగా నిలుస్తున్నాయన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. గ్రామోదయ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ టెక్నాలజీ వారు నిర్వహిస్తున్న 'కుంభ సందేశ్ యాత్ర " ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్ లో జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు జుబ్లీహిల్స్ పెద్దమ్మ గుడిలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ, కరోనా మహమ్మారి లాంటి క్లిష్టమైన సమయంలోనూ ప్రపంచమంతా, భారత సాంప్రదాయాలు పాటించిందని గుర్తు చేశారు. భారత దేశ సంస్కృతీ, సంప్రదాయాలను కొత్త తరానికి చేరవేయడంతో పాటు, ప్రపంచవ్యాప్తం చేసేందుకు కుంభ సందేశ్ యాత్రను నిర్వహిస్తున్న వసంత్ ను ఎమ్మెల్సీ కవిత అభినందించారు. కన్యాకుమారి నుంచి హరిద్వార్ వరకు ఈ యాత్ర జరగనుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష