రాత పరీక్ష లేకుండా ఇండియన్ రైల్వేలో భారీగా ఉద్యోగాలు.!
- February 19, 2021
వరుసగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్న ఇండియన్ రైల్వేస్ తాజాగా మరోసారి భారీ సంఖ్యలో నియామకాలను చేపట్టింది. మొత్తం 2500లకు పైగా అప్రెంటీస్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ముంబై కేంద్రంగా పనిచేస్తున్న సెంట్రల్ రైల్వేలో ఉన్న ఖాళీలను భర్తీ చేయడానికి ఈ నియామకాలను చేపట్టారు. అయితే ఎలాంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూలు లేకుండానే మార్కుల ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు మార్చ్ 5 వ తేదీ సాయంత్రం 5 గంటల లోగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
ఖాళీల వివరాలు..
ముంబాయిలోని వివిధ విభాగాల్లో 1767 పోస్టులను భర్తీ చేస్తున్నారు. భూసావల్ రైల్వే డివిజన్ పరిధిలో 420 అప్రెంటీస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. పూణేలో 152, షోలాపూర్ లో 79 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.
అర్హతల వివరాలు..
అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో టెన్త్ అర్హత సాధించి ఉండాలి. NCVT సర్టిఫికేట్ ను పొంది ఉండాలి. అభ్యర్థుల వయస్సు 15 నుంచి 24 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఐటీఐ, టెన్త్ మార్కుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
అధికారిక వెబ్‌సైట్:https://www.rrccr.com/
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







