బాలయ్య - బోయపాటి మూవీకి టైటిల్ ఫిక్స్.!
- February 19, 2021
సింహా, లెజెండ్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల తర్వాత బాలకృష్ణ- బోయపాటి శీను కాంబోలో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. బీబీ3 అనే టైటిల్‌తో ప్రచారం జరుపుకుంటున్న ఈ సినిమాలో బాలయ్య అఘోరాగ కనిపిస్తాడని ప్రచారం జరుగుతుంది. ఈ చిత్రానికి మోనార్క్ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్టు కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీకి గాడ్ ఫాదర్ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది.
బాలయ్య ఇమేజ్‌కు, కథకు గాడ్ ఫాదర్ అనే టైటిల్ అయితేనే సరిగ్గా సరిపోతుందని భావించిన మేకర్స్ ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన మరి కొద్ది రోజులలో రానుంది. రవీందర్ రెడ్డి నిర్మాణంలో ద్వారకా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటి వరకు చిత్రానికి సంబంధించి విడుదలైన పోస్టర్స్, వీడియోలు ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్నాయి. మే 28న ఈ సినిమా విడుదల కానుంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







