కేంద్ర మంత్రికి వినతిపత్రం సమర్పించిన గల్ఫ్ జెఏసి ప్రతినిధులు

- March 09, 2021 , by Maagulf
కేంద్ర మంత్రికి వినతిపత్రం సమర్పించిన గల్ఫ్ జెఏసి ప్రతినిధులు

న్యూ ఢిల్లీ:88 లక్షల భారతీయ గల్ఫ్ కార్మికుల జీవితాలపై ప్రభావం చూపే కనీస వేతనాలు తగ్గింపు సమస్యపై  తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (గల్ఫ్ జెఏసి) ప్రతినిధుల బృందం మంగళవారం కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి. మురళీధరన్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. 

గల్ఫ్ కార్మికులకు 30 నుండి 50 శాతం వేతనాలు తగ్గించడము వలన వారు మరింత పేదరికంలోకి జారిపోయే అవకాశమున్నదని, కనీస వేతనాలను తగ్గిస్తూ భారత ప్రభుత్వం జారీ చేసిన సర్కులర్ల రద్దు చేయాలని  గల్ఫ్ జెఏసి ప్రతినిధులు మంత్రిని కోరారు.గల్ఫ్ జేఏసీ కన్వీనర్ గుగ్గిల్ల రవిగౌడ్, జేఏసీ రాష్ట్ర నాయకులు స్వదేశ్ పరికిపండ్ల, తోట ధర్మేందర్, కోటపాటి నరసింహ నాయుడు, వీరయ్య మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com