సల్మానియా మెడికల్ కంప్లెక్స్‌లో డాక్టర్లపై పేషెంట్ దాడి

- March 13, 2021 , by Maagulf
సల్మానియా మెడికల్ కంప్లెక్స్‌లో డాక్టర్లపై పేషెంట్ దాడి

బహ్రెయిన్:ఓ పేషెంట్, సల్మానియా మెడికల్ కాంప్లెక్స్ సిబ్బందిపై దాడి చేశాడు. ఈ ఘటనలో ఇద్దరు వైద్యులు, సెక్యూరిటీ సిబ్బందికి గాయాలయ్యాయి. యాక్సిడెంంట్ మరియు ఎమర్జెన్సీ విభాగాన్ని తరచూ సందర్శించే వ్యక్తి ఈ ఘటనకు బాధ్యుడుగా హాస్పిటల్ సిబ్బంది పేర్కొన్నారు. డాక్టర్లను తిట్టడం, వారిపై దాడి చేయడం వంటి చర్యలకు నిందితుడు పాల్పడ్డాడనీ, అతన్ని అదుపు చేసేందుకు ప్రయత్నించిన సెక్యూరిటీ సిబ్బందినీ గాయపర్చాడనీ ఆసుపత్రి నిర్వాహకులు తెలిపారు. గవర్నమెంట్ హాస్పిటల్స్ సీఈఓ డాక్టర్ అహ్మద్ ముహమ్మద్ అల్ అన్సారీ మాట్లాడుతూ, సల్మానియా ఆసుపత్రి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తోందనీ, అలాంటి ఆసుపత్రిలో జరిగిన దాడి ఖండనీయమని అన్నారు. నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com