బహ్రెయిన్ రోడ్డుకి సౌద్ అల్ ఫైసల్ పేరు
- February 28, 2016
క్రౌన్ ప్రిన్స్, డిప్యూటీ సుప్రీం కమాండర్, ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, ప్రిన్స్ సల్మాన్ హమాద్ అల్ ఖలీఫా ఈ రోజు, మక్కా రీజియన్ గవర్నర్మరియు రెండు హోలీ మాస్క్‌ల కస్టోడియన్ అడ్వయిజర్, ప్రిన్స్ ఖలీద్ అల్ ఫైసల్, కింగ్ ఫైసల్ జెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ ఇస్లామిక్ స్టడీస్ ఛైర్మన్ ప్రిన్స్ తుర్కి అల్ ఫైజల్‌ని మనామాలో కలిశారు. ఈ సందర్భంగా బహ్రెయిన్‌లోని ఓ ప్రముఖమైన రోడ్డుకి సౌదీ దివంగత ఫారిన్ మినిస్టర్ ప్రిన్స్ సౌద్ అల్ ఫైసల్ పేరు పెట్టడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కింగ్ హమాద్, ప్రిన్స్ సౌద్‌కి గౌరవార్ధం, బహ్రెయిన్‌కి ఇచ్చిన స్నేహహస్తానికి గుర్తింపుగా ఈ చర్య తీసుకున్నారు. ఈ సందర్భంగా బహ్రెయిన్, సౌదీ అరేబియా మధ్య సన్నిహిత సంబంధాలు, పరస్పర సహకారం మరింత గొప్పగా కొనసాగాలని ఇరు దేశాల ప్రముఖులు ఆకాంక్షించారు. తీవ్రవాదాన్ని అణచివేయడంలో సౌదీ అరేబియా పోషిస్తున్న పాత్రను బహ్రెయిన్ బృందం అభినందించింది.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







