మార్చి 1 నుంచి హెల్మెట్, లైసెన్స్ తప్పనిసరి
- February 29, 2016
మీరు ద్విచక్ర వాహనాదారాలా? అయితే రేపటి నుంచి హెల్మెట్, లైసెన్స్ తప్పనిసరిగా మీ వెంట తీసుకెళ్లండి. ఎందుకంటే హెల్మెట్, లైసెన్స్ లేకండా వాహనంతో రోడ్డెక్కితే భారీ జరిమానా విధించనున్నారు. లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే రూ. 2వేలు హెల్మెట్ లేకపోతే రూ. 100 కట్టాల్సిందే.ఈ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని తెలంగాణ రవాణా, పోలీసు శాఖలు నిర్ణయించాయి. మార్చి 1వ తేదీ నుంచి ప్రత్యేక బృందాలు నగరంలో తనిఖీలు ముమ్మరం చేయనున్నాయి. తనిఖీల్లో తరచూ పట్టుబడే వారిపై కఠినంగా వ్యవహరించనున్నారు.రోడ్డు భద్రత నేపథ్యంలో రెండు శాఖల అధికారులు సమన్వయంతో ముందుకెళుతున్నారు. రోడ్డు భద్రతపై సుప్రీం కమిటీ సూచనలను ఖచ్చితంగా అమలు చేయడంలో భాగంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. నిబంధనలు పాటించని వారికి చట్టప్రకారం శిక్ష పడేలా రంగం సిద్ధం చేస్తున్నారు.లైసెన్స్లు లేనివారు తీసుకునేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని రవాణాశాఖ నిర్ణయించింది. లైసెన్స్ లేని వారు, ఉండి సస్పెండ్ అయినవారు వాహనాలను నడిపితే శిక్షపడేలా అధికారులు ప్రయత్నిస్తున్నారు. డ్రంకన్ డ్రైవ్లో మూడు సార్లకు మించి పట్టుబడిన వారు మళ్లీ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే జైలు శిక్ష విధించే అవకాశం ఉందని తెలిపారు.హెల్మెట్ తప్పనిసరి అని గత కొన్ని నెలలుగా నగరంలో విసృత్తంగా ప్రచారం చేసి అవగాహన కల్పించామని, అయినా చాలామంది వాడడం లేదని హైదరాబాద్ జిల్లా జేటీసీ టి.రఘనాథ్ తెలిపారు. మార్చి 1 నుంచి చేపట్టే తనిఖీల్లో హెల్మెట్ లేకుండా వాహనం నడుపుతూ పట్టుబడితే జరిమానా విధిస్తామని తెలిపారు.పట్టుబడిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించబోమన్నారు. హెల్మెట్, లైసెన్స్తో పాటు ఫోన్ మాట్లాడుతూ సిగ్నల్ జంపింగ్, మితిమీరిన వేగంతో డ్రైవింగ్ చేయడం, ఓవర్ లోడింగ్ వంటి ఉల్లంఘనలపై రెండు శాఖల అధికారులు కఠినంగా వ్యవహారిస్తామన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







