పేద విద్యార్థులకు ఉపకారవేతనాలు : మలబార్ గోల్డ్
- February 29, 2016
2015-16 విద్యా సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ చదువుతున్న రెండువేల మంది నిరుపేద విద్యార్థినులకు రూ.2000 చొప్పున మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థ ఉపకార వేతనాలను చెక్కుల రూపంలో అందజేసింది. సామాజిక సేవలో భాగంగా ఎంపవరింగ్ ఎడ్యుకేషన్, ఎంపవరింగ్ ఉమెన్‌హుడ్ కార్యక్రమం కింద 22వ వార్షికోత్సవం సందర్భంగా ఉపకారవేతనాలు అందించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్.. విద్యార్థులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా మలబార్ గ్రూప్ కంపెనీల చైర్మన్ శ్రీ ఎంపీ ఆహ్మద్ మాట్లాడుతూ.. సామాజిక కార్యక్రమాల్లో భాగంగా పేద విద్యార్థులకు ఉపకారవేతనాలు అందించామన్నారు.వైద్యం, విద్య, మహిళా సాధికారిత కోసం సంస్థ కృషి చేస్తున్నదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలు సామాజిక కార్యక్రమాలను ప్రకటించింది. దేశంలోనే కాకుండా గల్ఫ్ దేశాల్లో విద్య, మహిళా సాధికారత, ఆరోగ్య, గృహ నిర్మాణం, పర్యావరణం తదితర అంశాల్లో అనేక సేవా కార్యక్రమాలను చేపట్టింది. గత రెండు దశాబ్దాలుగా వ్యాధిగ్రస్తులకు ఔషధాల పంపిణీ, నిరాశ్రయ ప్రజలకు ఇండ్ల నిర్మాణం కోసం ఆర్థిక సహాయం, పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలను మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థ చేపడుతున్నది.
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







