టీకా కార్యక్రమం పై అసంతృప్తి వ్యక్తం చేసిన WHO

- April 01, 2021 , by Maagulf
టీకా కార్యక్రమం పై అసంతృప్తి వ్యక్తం చేసిన WHO

జెనీవా: ఐరోపా సమాఖ్యలో టీకా కార్యక్రమం నెమ్మదిగా సాగుతుండటంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) పై తాజాగా తీవ్ర విమర్ళలు చేసింది.వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ఇంత నెమ్మదిగా సాగడం అసలేమాత్రం ఆమోదయోగ్యం కాదని, దీని వల్ల కరనా సంక్షోభం మరింత కాలం పాటు కొనసాగుతుందంటూ ఐరోపా దేశాలపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ‘జానాభాలో కేవలం 10 శాతం మందికే తొలి టీకా డోసు లభించింది.నాలుగు శాతం మందే పూర్తి డోసులను తీసుకున్నారు అని WHO ఐరోపా శాఖ అధిపతి హాన్స్ క్లాజ్ తెలిపారు.మునుపటితో పోలీస్తే ప్రస్తుతం ఐరోపాలో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని పేర్కొన్నారు.టీకా ఉత్పత్తిని మరింత వేగవంతం చేసి..టీకా కార్యక్రమానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగించాలని ఆయన సూచించారు. ప్రస్తుత ఐరోపాలో ఉన్న ప్రతి టీకా వయల్‌ను వినియోగించాలని ఆయన స్పష్టం చేశారు.టీకా కార్యక్రమంలో అమెరికా, బ్రిటన్‌ల కంటే ఐరోపా బాగా వెనకబడిన విషయం తెలిసిందే. టీకాల కోసం ఆర్డర్లు పెట్టడంతో పాటూ వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించడంలో ఐరోపా దేశాలు ఆలస్యం చేసాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com