ప్రధాని మోదీ కీలక సమీక్ష..!

- April 04, 2021 , by Maagulf
ప్రధాని మోదీ కీలక సమీక్ష..!

న్యూ ఢిల్లీ:భారత్ లో కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంపై ప్రధాని మోదీ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు.వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరుగుతున్న ఈ సమావేశానికి కేబినెట్‌ సెక్రెటరీతో సహా పలువురు సీనియర్‌ అధికారులు, ప్రధాని ముఖ్య కార్యదర్శ, ఆరోగ్య శాఖ కార్యదర్శి డాక్టర్‌ వినోద్‌ పాల్‌ హాజరైనట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.ప్రస్తుతం దేశంలో కరోనా విజృంభణ,వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతున్న తీరుపై ఈ సమావేశంలో చర్చిస్తున్నట్లు సమాచారం.కాగా...భారత్ లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది.కేసులు రికార్డ్ స్థాయిలో నమోదవుతున్నాయి.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com