ఎయిర్ అరేబియా బంపర్ ఆఫర్!
- April 08, 2021
షార్జా: యూఏఈ నుంచి ఇండియాకు వచ్చేందుకు ప్లాన్ చేసుకుంటున్న భారతీయులకు షార్జా కేంద్రంగా పని చేస్తున్న ఎయిర్ అరేబియా విమానయాన సంస్థ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇండియాకు వెళ్లేందుకు అతి తక్కవ ధరకే విమాన టికెట్లను అందిస్తున్నట్టు వెల్లడించింది. కేవలం 300దిర్హమ్‌లతో భారత్‌కు ప్రయాణించొచ్చని పేర్కొంది. అయితే భారత్‌లోని ఎంపిక చేసిన నగరాలకు వెళ్లేందుకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిందని స్పష్టం చేసింది.యూఏఈ నుంచి ముంబైకి కేవలం 300 దిర్హమ్‌లను మాత్రమే వసూలు చేయనున్నట్టు తెలిపింది.
ఢిల్లీ, చెన్నైకి వెళ్లేందుకు వరుసగా 350, 410 దిర్హమ్‌లు చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించింది. కాలికట్, బెంగళూరు వెళ్లేందుకు వరుసగా 325, 390 దిర్హమ్‌లకే టికెట్ అందిస్తామని ప్రకటించింది. అంతేకాకుండా భారత్ వచ్చే ప్రయాణికుల కోసం ఈ విమానయాన సంస్థ మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రయాణానికి 72 గంటల ముందు ప్రయాణికులు కొవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్‌ను పొంది ఉండాలని స్పష్టం చేసింది. ఆ సర్టిఫికెట్‌ను ఎయిర్ సువిధా పోర్టల్(https://www.newdelhiairport.in/airsuvidha/apho-registration)లో అప్‌లోడ్ చేయడంతోపాటు సెల్ఫ్ డిక్లరేషన్‌ను సమర్పించాలని కోరింది. అంతేకాకుండా ఆరోగ్యసేతు మొబైల్ యాప్‌ను ప్రయాణికులు డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుందని వెల్లడించింది.
--బాలాజీ(మాగల్ఫ్ ప్రతినిధి, షార్జా)
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్‌లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్‌లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







