భార‌త్-దుబాయ్ ప్ర‌యాణికుల‌కు పీసీఆర్ టెస్ట్ పై కొత్త సూచ‌న‌లు

- April 20, 2021 , by Maagulf
భార‌త్-దుబాయ్ ప్ర‌యాణికుల‌కు పీసీఆర్ టెస్ట్ పై కొత్త సూచ‌న‌లు

దుబాయ్: భార‌త్ లో కోవిడ్ తీవ్ర‌త శ‌ర‌వేగంగా పెరిగిపోతుండ‌టంతో ఇప్ప‌టికే ప‌లు దేశాలు ఇండియాపై ట్రావెల్ బ్యాన్ విధిస్తున్న విష‌యం తెలిసిందే.ఈ నేప‌థ్యంలో దుబాయ్ కూడా భార‌త్ నుంచే వ‌చ్చే ప్ర‌యాణికులపై ఫోక‌స్ చేసింది.పీసీఆర్ టెస్ట్ రిపోర్టుల‌కు సంబంధించి కొత్త మార్గ‌నిర్దేశ‌కాల‌ను జారీ చేసింది.దుబాయ్ ఫ్లైట్ ఎక్కే స‌మ‌యానికి 48 గంట‌ల్లోపు శాంపిల్ ఇచ్చిన పీసీఆర్ రిపోర్ట్ ల‌నే ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటామ‌ని స్ప‌ష్టం చేసింది.ప్ర‌యాణికులు తాము బ‌య‌ల్దేరే ప్రాంతంలో ఏ రోజు,ఏ స‌మ‌యంలో శాంపిల్ ఇచ్చారో స్ప‌ష్టంగా పేర్కొవాలి.అలాగే రిపోర్ట్ జారీ చేసిన తేది, స‌మ‌యాన్ని కూడా స్ప‌ష్టంగా పేర్కొవాలి.పీసీఆర్ రిపోర్ట్ పై ఖ‌చ్చితంగా క్యూఆర్ కోడ్ ఉండాల‌ని కోడ్ స్కాన్ చేయ‌టం ద్వారా ల్యాబ్ వివ‌రాల‌తో పాటు ఒరిజిన‌ల్ స‌ర్టిఫికెట్ వివ‌రాల‌ను కూడా ఎయిర్ లైన్స్ సంస్థ‌లు క్రాస్ చెక్ చేసుకుంటాయ‌ని దుబాయ్ వెల్ల‌డించింది.ఏప్రిల్ 22 నుంచి ఈ కొత్త మార్గ‌నిర్దేశ‌కాలు అమ‌లులోకి రానున్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com