స్కూల్ మినీ ఒలింపిక్స్ 2016 తేదీ ఖరారు
- March 02, 2016
మూడవ స్కూల్ మినీ ఒలింపిక్స్‌కి ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. ఏప్రిల్ 21 నుంచి మే 5 వరకు ఈ ఒలింపిక్స్ జరుగుతాయి. రెండు వారాల పాటు జరిగే ఈ ఈవెంట్, వరుసగా మూడోసారి. బహ్రెయిన్ ఒలింపిక్ కమిటీ (బిఓసి), మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ సహాయంతో వివిధ పాఠశాలలకు చెందిన 1992 మంది విద్యార్థులతో ఈ ఈవెంట్‌ని నిర్వహించడం జరుగుతుంది. బిఓసి సెక్రెటరీ జనరల్ అబ్దుల్రహమ్మాన్ అస్కర్ మాట్లాడుతూ, స్కూల్ మినీ ఒలింపిక్స్‌ని ఎంతో ముఖ్యమైన కార్యక్రమంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 1992 మంది విద్యార్థులు పాల్గొనడం ద్వారా ఈ ఈవెంట్ కొత్త చరిత్రను సృష్టిస్తుందని ఆయన అన్నారు. పబ్లిక్ హెల్త్ పట్ల అవేర్నెస్ పెంచడం, అలాగే ఆటల పట్ల విద్యార్థుల్లో ఆసక్తిని పెంచడం, ఫిజికల్ ఎడ్యుకేషన్ పట్ల విద్యార్థుల్లో అవగాహన కల్పించడం వంటి ముఖ్య ఉద్దేశ్యాలతో ఒలింపిక్స్ నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు. ఆటల ద్వారా ఆరోగ్యంగా ఉంటామనే మంచి మెసేజ్ ఈ పోటీల ద్వారా ఇస్తున్నామని చెప్పారు అబ్దుల్రహమాన్.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







