ఖతార్‌లో మెడిసిన్ వెండింగ్ మెషీన్లు
- March 02, 2016
మిడిల్ ఈస్ట్‌లో తొలిసారిగా ఖతార్ మెడిసిన్ వెండింగ్ మెషీన్లను ప్రారంభించనుంది. డాక్టర్లు సూచించిన మందుల్ని ఫార్మసిస్టులతో సంబంధం లేకుండా ఆటోమేటిక్ మెషీన్ల ద్వారా విక్రయించేందుకు ఖతార్ ఏర్పాట్లు చేస్తోంది. న్యూ విమెన్స్ హాస్పిటల్ ఈ సర్వీసు గురించిన ప్రయోగాలు చేస్తోంది. ఆసుపత్రికి చెందిన వివిధ డిపార్ట్మెంట్స్ ఆటోమేటెడ్ సెల్ఫ్ సర్వీస్ కియోస్క్‌లను ప్రయోగాత్మకంగా అమల్లోకి తీసుకురానుంది. ఆసుపత్రి ఫార్మసీ వద్ద పేషెంట్లకు సమయం వృధా కాకుండా ఈ కియోస్కీ మెడిసిన్ వెండింగ్ మెషీన్ ఉపకరించనున్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. పేషెంట్ ఐడీతో డాక్టర్లు డిజిటల్ ప్రిస్క్రిప్షన్ ప్రిపేర్ చేస్తారు. దానికి ఓ ఐడీని క్రియేట్ చేస్తారు. కియోస్కీ వద్దకు వెళ్ళి ఐడీని నమోదు చేస్తే, దానికి సంబంధించిన ప్రిస్క్రిప్షన్ తద్వారా మందులు రానున్నాయి. ఫార్మసిస్టుల కొరత నుంచి ఆసుపత్రులకూ ఈ కియోస్కీల ద్వారా ఉపశమనం కలుగుతుంది. అదే సమయంలో పేషెంట్లకు మెరుగైన విధంగా మందులు అందుతాయి.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







