2022 వరల్డ్ కప్ ఖతార్‌లోనే
- March 02, 2016
ఫిఫా న్యూ ప్రెసిడెంట్ జియాన్ని ఇన్‌ఫాంటినో మాట్లాడుతూ 2022 వరల్డ్ కప్‌ని ఖతార్‌లోనే నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కొత్త ఫిఫా అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికైన ఇన్‌ఫాంటినో, జ్యురిచ్‌లోని గ్లోబల్ బాడీ హెడ్ క్వార్టర్‌లో బాద్యతలు చేపట్టిన తరువాత మాట్లాడుతూ, 2018లో రష్యాలోనూ, 2022లో ఖతార్‌లోనూ ఫిఫా వరల్డ్‌కప్ నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. 2010లో తీసుకున్న నిర్ణయం ప్రకారం ఖతార్, రష్యాలలో వరల్డ్‌కప్ పోటీలు జరుగుతాయని ఆయన చెప్పారు. గత మార్చ్‌లో, ఖతార్ వరల్డ్‌కప్ పోటీల్ని వింటర్ నెలల్లో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. వేసవి కాలంలో ఖతార్‌లో ఉండే వేడి వాతావరణం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇన్‌ఫాంటినో వ్యాఖ్యల్ని ఖతార్ స్వాగతించింది. ఖతార్‌లో వరల్డ్ కప్ పోటీల నిర్వహణకు సహకరిస్తున్న గల్ఫ్ కౌన్సిల్ దేశాలకు, ఇతర దేశాలకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఖతార్ వెల్లడించింది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







