విజిట్ వీసాదారులకు వ్యాక్సిన్ ఇవ్వట్లేదని తేల్చేసిన యూఏఈ
- April 29, 2021
యూఏఈ: విజట్ విసాపై యూఏఈలో ఉన్న వారికి కూడా వ్యాక్సిన్ ఇస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని యూఏఈ ఆరోగ్య శాఖ కొట్టిపారేసింది. విజిట్ విసాదారులకు వ్యాక్సిన్ ఇవ్వట్లేదని క్లారిటీ ఇచ్చింది. పర్యాటక విసాతో ప్రస్తుతం యూఏఈలో ఉన్న వారికి రస్ అల్ ఖైమా ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సిన్ ఇస్తున్నారంటూ ఇటీవలి కాలంలో వాట్సాప్ మెసేజ్ లు చక్కలర్లు కొడుతోంది. అంతేకాదు..జనం నమ్మేలా యూఏఈ ఆరోగ్యశాఖ వెబ్ సైట్ సమాచారంలా సందేశాన్ని మేకోవర్ చేశారు. దీంతో చాలా మంది నిజమనుకొని రస్ అల్ ఖైమా ఆరోగ్య కేంద్రాలకు క్యూ కడుతున్నారు. విజిట్ వీసాతో ప్రస్తుతం దుబాయ్ లో ఉంటున్న మన్మోహన్ సింగ్ అతని భార్య కూడా ఇలాంటి మేసేజ్ చూసి దుబాయ్ నుంచి రస్ అల్ ఖైమాలోని ఆరోగ్య కేంద్రానికి వెళ్లారు. అయితే..అది ఫేక్ మేసేజ్ అని తెల్సుకున్నారు. మన్మోహన్ సింగ్ దంపతుల తరహాలోనే అప్పటికే చాలా మంది విజిట్ వీసాదారులు రస్ అల్ ఖైమా ఆరోగ్య కేంద్రానికి వెళ్లినట్లు తెలుస్తోంది.దీంతో వాట్సాప్ మెసేజ్ లపై స్పందించిన ఆరోగ్య శాఖ పర్యాటకులను ఉద్దేశిస్తూ తాము విజిట్ విసాదారులకు కోవిడ్ వ్యాక్సినేషన్ అందించట్లేదని స్పష్టం చేసింది.

తాజా వార్తలు
- వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు.. నేపాల్‌కు భారత్ రెస్క్యూ బృందాల సహకారం
- అబుదాబిలో ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ మహమ్మద్
- యూఏఈలో అనధికార ఆన్లైన్ ఫత్వా ఖాతాల పై చర్యలు..
- సెంచరీతో చెలరేగిన డీజీపీ సీవీ ఆనంద్..
- యూఏఈలో పర్సనల్ లోన్ చెల్లింపులు నిలిచిపోతే ఏమవుతుంది?
- దుబాయ్ ఎయిర్‌పోర్టులో కొత్త స్కానర్లు..
- భారతీయులకు ఉజ్బెకిస్తాన్ బంపరాఫర్..
- మసందమ్‌లో కొత్త రహదారి..ఖసబ్-దిబ్బా ప్రయాణ సమయం 55 నిమిషాలకు తగ్గింపు
- హైదరాబాద్ లో అతిపెద్ద క్రికెట్ స్టేడియం..
- ప్రధాని మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం







