SRH టీం కెప్టెన్ గా కేన్ విలియమ్సన్
- May 01, 2021
ఐపీఎల్ 2021లో వరుస పరాజయాలను ఎదుర్కుంటున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ కీలక నిర్ణయం తీసుకుంది. రేపు జరగబోయే మ్యాచ్ నుంచి,ఈ సీజన్ ముగిసేవరకు కేన్ విలియమ్సన్ కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టబోతున్నట్లు ట్విట్టర్ వేదికగా అధికారికంగా ప్రకటించింది. అటు ప్రస్తుత కెప్టెన్, విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ పై వేటు వేసింది. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం తీసుకున్న ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పలువురు నెటిజన్లు ఈ నిర్ణయానికి మద్దతుగా కామెంట్స్ చేస్తుంటే.. మరికొందరు వ్యతిరేకత చూపిస్తున్నారు.
కాగా, ఈ సీజన్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇప్పటివరకూ ఆరు మ్యాచ్ లు ఆడింది. ఇందులో ఐదు మ్యాచ్ లు ఓడిపోగా.. ఒక్క మ్యాచ్ లో మాత్రమే విజయం సాధించింది. ఈ నేపథ్యంలో యాజమాన్యం కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.వార్నర్ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ట్వీట్ లో పేర్కొంది.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







