ఢిల్లీలో లాక్‌డౌన్ మళ్లీ పొడిగింపు
- May 01, 2021
న్యూ ఢిల్లీ: ఢిల్లీలో మరోసారి లాక్‌డౌన్ పొడిగించారు.ఇప్పటికే రెండో విడతలగా లాక్‌డౌన్ విధించినా.. కోవిడ్ కంట్రోల్ కావడం లేదు.దీంతో.. మరో వారం రోజుల పాటు లాక్‌డౌన్ ఉంటుంది అంటూ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. కాగా, ఢిల్లీలో తాజాగా 27,000 కొత్త కేసులు నమోదు కాగా.. 375 మంది మృతిచెందారు.ఇలా వరుసగా 13వ రోజు 20 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.దీంతో.. మరోవారం పాటు లాక్‌డౌన్ ఆంక్షలు పొడిగించారు.కోవిడ్ సెకండ్ వేవ్ కట్టడికి మొదట ఏప్రిల్ 19 నుంచి 26వ తేదీ వరకు లాక్‌డౌన్ విధించిన ఢిల్లీ ప్రభుత్వం.. అయినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో మే 3వ తేదీ వరకు పొడిగించారు.ఇంకా.. పరిస్థితిలో ఏ మాత్రం తేడా లేకపోవడంతో..మరో వారం రోజుల పాటు లాక్‌డౌన్ విధిస్తున్నట్టు సీఎం అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు.దీంతో..ఈ నెల 10వ తేదీ వరకు ఢిల్లీలో లాక్‌డౌన్ అమల్లో ఉండబోతోంది.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







