7 దేశాల పై ఆంక్షలు విధించిన ఇజ్రాయెల్

- May 02, 2021 , by Maagulf
7 దేశాల పై ఆంక్షలు విధించిన ఇజ్రాయెల్

జెరూసలేం: కోవిడ్ సెకండ్ వేవ్ ఇప్పుడు అంద‌రినీ క‌ల‌వ‌ర‌పెడుతోంది.దీంతో.. క్ర‌మంగా చాలా దేశాలు విదేశీ ప్ర‌యాణికుల రాక‌పోక‌ల‌పై ఆంక్ష‌లు విధిస్తూ వ‌స్తున్నాయి.త‌మ దేశ‌స్తులు అయినా స‌రే విదేశాల‌కు వెళ్తే.. మ‌ళ్లీ అంత ఈజీగా వాళ్లు స్వ‌దేశంలో అడుగుపెట్టే ప‌రిస్థితులు లేకుండా పోతున్నాయి.తాజాగా.. భారత్ సహా ఏడు దేశాలకు తమ పౌరులు ప్రయాణించకుండా ఆంక్ష‌లు విధించింది ఇజ్రాయెల్ .. కోవిడ్ నేప‌థ్యంలో..ఇజ్రాయెల్ తమ దేశ పౌరులపై ఈ ఆంక్ష‌లు తీసుకొచ్చింది.ఈ నెల 3వ తేదీ నుంచి కొత్త ఆంక్ష‌లు అమలులోకి రానుండ‌గా.. 16వ తేదీ వరకు ఆంక్షలు కొనసాగుతాయని ప్ర‌క‌టించింది ఇజ్రాయెల్.ఇక‌, ఇజ్రాయెల్ ఆంక్షలు విధించిన దేశాల జాబితా గ‌మ‌నిస్తే భార‌త్‌లో పాటు ఉక్రెయిన్, బ్రెజిల్, ఇథియోపియా, దక్షిణాఫ్రికా,మెక్సికో,టర్కీ కూడా ఉన్నాయి.ఈ ఏడు దేశాల నుంచి ఇజ్రాయెల్ వచ్చే ప్రయాణికులు మాత్రం 14 రోజులు క్వారంటైన్​లో ఉండటం త‌ప్ప‌నిస‌రి చేసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com