హైదరాబాద్ విమానాశ్రయంలో ప్రయాణంలోనే మొబైల్స్‌ను ఛార్జింగ్ చేసుకోవచ్చు

- May 05, 2021 , by Maagulf
హైదరాబాద్  విమానాశ్రయంలో  ప్రయాణంలోనే మొబైల్స్‌ను ఛార్జింగ్ చేసుకోవచ్చు

హైదరాబాద్: మొబైల్ ఫోన్‌లో బ్యాటరీలు డిశ్చార్జ్ అయిపోవడం గురించి ఇకపై చింతించాల్సిన అవసరం లేదు. మీరు విమానాశ్రయంలో ఉన్నప్పుడు మీ ఆప్తులతో మాట్లాడలేకపోవడమే సమస్యను మర్చిపోండి. ప్రయాణంలో మీ ఛార్జింగ్ సమస్యలన్నీ తీర్చేందుకు స్పైక్ ఇన్నోవేషన్ సహకారంతో జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రత్యేకమైన ఛార్జింగ్ సదుపాయాన్ని మీ ముందుకు తెచ్చింది.

విమానాశ్రయంలోని ఈ నూతన సర్వీస్‌ ద్వారా ఛార్జర్‌ లేని లేదా మొబైల్ బ్యాటరీ/ఇతర గాడ్జెట్‌లు డిశ్చార్చి అయిపోయిన ప్రయాణీకులు పవర్ బ్యాంకులను అద్దెకు తీసుకోవచ్చు. ఈ పవర్ బ్యాంక్ స్టేషన్లు / కియోస్క్‌లు విమానాశ్రయంలోని వివిధ ప్రదేశాలలో ఏర్పాటు చేయబడ్డాయి. ప్రయాణికుల బ్యాటరీలు / గాడ్జెట్‌లను రీఛార్జ్ చేయడానికి, కావాల్సిందల్లా వారి Paytm వాలెట్‌లో కనీసం రూ .350 బ్యాలెన్స్ ఉండాలి. సమీప పవర్ బ్యాంక్ స్టేషన్లు / కియోస్క్‌లకు వెళ్లి, పవర్ బ్యాంక్‌లోని క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే చాలు పవర్ బ్యాంక్ బయటకు వస్తుంది. 

ఈ పవర్ బ్యాంకులు అటాచ్డ్ మైక్రో-యుఎస్‌బి, టైప్ సి మరియు సర్టిఫైడ్ ఆపిల్ లైటినింగ్ కేబుళ్లతో పాటు వస్తాయి. ఇవి అన్నిరకాల స్మార్ట్‌ఫోన్‌లను ఛార్జ్ చేయడానికి అనుకూలంగా ఉంటాయి. ప్రయాణీకులు ఈ పవర్ బ్యాంక్‌లతో తమ మొబైల్ / గాడ్జెట్‌లను నామమాత్రపు ధరకు రీఛార్జ్ చేసుకోవచ్చు. రీఛార్జ్ చేసిన తర్వాత వారు ఛార్జింగ్ స్టేషన్ / కియోస్క్ యొక్క ఖాళీ స్లాట్‌లో పవర్ బ్యాంక్‌ను తిరిగి పెట్టేయవచ్చు. పవర్ బ్యాంక్‌ వినియోగించిన  సమయం ఆధారంగా, ఆ మొత్తం వారి డిజిటల్ వాలెట్ నుండి కట్ అయిపోయింది. ఈ సర్వీసులో అనేక వార్షిక ప్రణాళికలు కూడా అందుబాటులో ఉన్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com