'ఖిలాడి` విడుదల వాయిదా
- May 05, 2021
హైదరాబాద్: రవితేజ హీరోగా రమేశ్ వర్మ దర్శకత్వంలో నిర్మితం అవుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమా 'ఖిలాడి`. ప్లే స్మార్ట్ అనేది ఈ సినిమా టాగ్ లైన్. రవితేజ మరోసారి ద్విపాత్రాభినయం చేస్తున్న సినిమా ఇది.జయంతీలాల్ సమర్పణలో కోనేరు సత్యనారాయణ హవీష్ ప్రొడన్స్ పతాకంపై రూపొందిస్తున్నారు.బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామి కావటం విశేషం.నిజానికి ఈ సినిమాను మే 28న విడుదల చేస్తామని యూనిట్ ప్రకటించింది.అయితే కోవిడ్ సెకండ్ వేవ్ వల్ల షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ కి అంతరాయం కలగటంతో ఈ సినిమా రిలీజ్ ను పోస్ట్ పోన్ చేస్తున్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది.ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ తో పటు టీజర్ కి అద్భుతమైన స్పందన లభించిన నేపథ్యంలో మాస్ మహారాజా రవితేజ కెరీర్ లో మరో హిట్ గా నిలుస్తుందనే నమ్మకంతో ఉన్నారు దర్శకనిర్మాతలు.కోవిడ్ తగ్గగానే కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తామంటోంది యూనిట్.
తాజా వార్తలు
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం







