త్రాగు నీరు - భద్రత
- April 07, 2015మనం నీరు త్రాగేముందు ఈ మధ్యకాలం లో ఏవేవో యంత్రాల ద్వారా శుద్ధి చేసిన మినరల్ వాటర్ ని కొని అవే మంచివి అని లీటర్ 4 రూపాయల నుండి 5 రూపాయలు పెట్టి కొంటున్నాం.కిన్లె లాంటి పెద్ద వ్యాపార సంస్థలు లీటర్ డబ్బా 20/- అమ్ముతున్నారు. కాని వాటిలో స్వచ్చత ఉందా అనే సందేహం చాల మందిలో ఉంది కానీ ఈ మధ్య చేసిన సర్వే లో తేలిన విషయం ఏంటంటే నీళ్ళల్లో ఒక కెమికల్ కలిపి వాటిని మినరల్ వాటర్ గా అమ్ముతున్నారు.దీనివలన ప్రమాదమే కానీ ఉపయోగం లేదు.రోగాలని కొనుక్కొని తెచ్చుకుంటున్నారు.ఇదంతా ఎందుకు చేస్తున్నారు అంటే ఆరోగ్యం కోసం అంటారు అందరు. రోగాల బారిన పడకూడదు అనుకుంటూనే రోగాలని కొనుక్కుంటున్నారు. ఇంకో విషయం ఏంటంటే బయట మార్కెట్ లో కొనే మినరల్ వాటర్ వలన మన శరీరం లో ఎముకల చుట్టూ ఉండే కాల్షియమ్ కరిగిపోయి ఎముకలు డొల్ల అవుతున్నాయి. దీనివలన ఎముక పటుత్వం కోల్పోయి చిన్న చిన్న సంఘటనలకే విరిగిపోతున్నాయి.ఇంతకి విషయం ఏంటంటే !!
భారతదేశం లో ఉన్న మన పూర్వీకులు కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే మన ఆరోగ్యం కోసం కొన్ని సూత్రాలు చెప్పారు.అందులో ఇది ఒకటి. నీటిని శుభ్రపరిచేందుకు రాగి,ఇత్తడి బిందెలు,చెంబులు వాడేవారు.వీటిని వాడటం వలన నీటిలో ఉండే సూక్ష్మ క్రిములు చనిపోతాయి.
ఈ మధ్య జరిగిన ఒక ప్రయోగంలో "రోబ్ రీడ్" అనే శాస్త్రవేత్త ప్లాస్టిక్ పాత్రలు,మట్టి పాత్రలు,ఇత్తడి,రాగి పాత్రలలో విరోచానకారి అయిన ఒక సూక్ష్మ క్రిమిని వేశారు. దీనిని 24 గంటల తర్వాత పరిశీలించగా ఇత్తడి, రాగి పాత్రలలో వేసిన క్రిముల శాతం తగ్గింది. మరల 48 గంటల తరువాత పరిశీలించగా రాగి మరియు ఇత్తడి పాత్రలలో క్రిములు 99 శాతం నశించిపోయాయి. కాని ప్లాస్టిక్ పాత్రలలో వేసిన క్రిమి 24 గంటలకి రెట్టింపు అయింది. 48 గంటలకి దానికి రెట్టింపు అయింది అని కనుగొన్నారు.
ఈ మధ్య కాలంలో అనేక బహుళ అంతస్తుల హోటల్స్ లో రాగి పాత్రలను వాడటం గమనార్హం.ఎందుకంటే వారి కస్టమర్స్ ఆరోగ్యం వారికి ముఖ్యం కదా.
కనుక రాగి,ఇత్తడి పాత్రలను వాడండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి.
--- వనంబతిన మాధురి, దోహా
తాజా వార్తలు
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..
- షార్జాలో ఎతిహాద్ రైల్ స్టేషన్కు మూడు కొత్త బస్సు మార్గాలు







