గల్ఫ్ ఎయిర్ ప్రయాణికులకు కోవిడ్ 19 ఉచిత బీమా
- May 11, 2021
బహ్రెయిన్: తమ ప్రయాణికుల కోసం గల్ఫ్ ఎయిర్ కోవిడ్ 19 బీమా సౌకర్యాన్ని ఉచితంగా అందించనుంది. గల్ఫ్ ఎయిర్ టికెట్లను కొన్న ప్రతి ప్రయాణికుడికి ఈ బీమా సౌకర్యం వర్తిస్తుంది.తమ ప్రయాణంలో దురదృష్టవశాత్తు ప్రయాణికుడు కోవిడ్ బారిన పడితే..చికిత్సకు అయ్యే ఖర్చుతో పాటు క్వారంటైన్ సమయంలో అయ్యే ఖర్చు కూడా బీమా పాలసీలో కవర్ అవుతుంది.అలాగే ప్రయాణికుడు జర్నీలో ఉండగా కోవిడ్ ఉన్నట్లు నిర్ధారణ అయితే..అతని వైద్య సాయంతో పాటు క్వారంటైన్ ఖర్చును తిరిగి స్వదేశానికి పంపించే ఖర్చులు కూడా ఇన్సూరెన్స్ లో కవర్ అవుతాయని గల్ఫ్ ఎయిర్ వెల్లడించింది.10 మే నుంచి 10 నవంబర్ 2021 వరకు గల్ఫ్ ఎయిర్ వెబ్ సైట్, కాల్ సెంటర్, సేల్స్ ఆఫీసర్, ఏజెంట్ల నుంచి కొన్న టికెట్లకు ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. కోవిడ్ 19 ఇన్సూరెన్స్ కోసం ప్రయాణికులు అదనంగా చెల్లించాల్సిన అవసరం ఉండదని, బీమా సౌకర్యం పూర్తిగా ఉచితంగా అందిస్తున్నట్లు వెల్లడించింది.మరిన్ని వివరాల కొరకు ఈ క్రింద లింకు క్లిక్ చెయ్యండి.
https://www.gulfair.com/covid19-insurance
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







