భారత్ కు బాసటగా విరాళాలు సేకరించనున్న కువైట్
- May 11, 2021
కువైట్ సిటీ: కోవిడ్ వేరియంట్స్ తో భారత్ ఎదుర్కొంటున్న సవాళ్లను ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటున్న కువైట్ ప్రభుత్వం..ఈ క్లిష్ట పరిస్థితుల్లో భారత్ కు వీలైనంత సాయం
అందించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఇప్పటికే వైద్య పరికరాలు, ఆక్సిజన్ సిలిండర్లు పంపిన కువైట్..తమ స్నేహశీలతను చాటుకునేలా ఫండ్ రైజింగ్ ప్రొగ్రాం చేపట్టింది. ఈ మేరకు సాంఘిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ నెల 18న కోవిడ్ రిలీఫ్ ఫండ్ పేరుతో విరాళాలు సేకరించాలని నిర్ణయించింది.గత నెల 26న జరిగిన కేబినెట్ సమావేశ నిర్ణయాలకు అనుగుణంగా కువైట్ విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి తమకు విరాళాల సేకరణకు సంబంధించి లేఖ అందిందని సాంఘిక సంక్షేమ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. యార్‌మౌక్‌లోని కమ్యూనిటీ డెవలప్‌మెంట్ సెంటర్ హాల్‌లో ఈ నెల 18న ఉదయం 10 గంటల నుంచి విరాళాల సేకరణ ప్రారంభం అవుతుందని వివరించింది. పలు స్వచ్ఛంద సంస్థలను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యంతో పెద్ద మొత్తంలో విరాళాలు సేకరించేలా కృషి చేస్తామని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







