తెలంగాణ కరోనా అప్డేట్
- May 27, 2021
హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి.ప్రస్తుతం కరోనా రికవరీ రేటు 93 శాతంగా ఉందని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు తెలిపారు.రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 3,614 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 18 మంది కరోనాతో మృతిచెందారు.ఇదే సమయంలో 3,961 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారని ఆయన వెల్లడించారు.లాక్డౌన్ సమయంలో కరోనా పాజిటివిటీ రేటు చాలా తగ్గిందన్న ఆయన.. ప్రస్తుతం కరోనా పాజిటివిటీ రేటు 4 శాతం ఉండగా,మరణాల రేటు 0.5 శాతంగా ఉందని తెలిపారు.. మరోవైపు.. ఆస్పత్రుల్లో చేరే కరోనా బాధితుల సంఖ్య కూడా తగ్గుతుందని తెలిపారు శ్రీనివాస్‌రావు.10 రోజుల్లో బెడ్ ఆక్యుపెన్సీ రేటు 54 శాతం నుంచి 39 శాతానికి పడిపోయిందని.. రాష్ట్రంలో పాజిటివ్ కేసులు గణనీయంగా తగ్గుతున్నాయని తెలిపారు.లాక్డౌన్, ఫీవర్ సర్వేలు మంచి ఫలితాలు ఇస్తున్నాయన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







