తెలంగాణ రాష్ట్రం సోనియా వల్లే వచ్చింది: ఉత్తమ్
- June 02, 2021
హైదరాబాద్: ఆరున్నర దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆంకాంక్షను నెరవేర్చిన ఘనత సోనియా గాంధీకి దక్కుతుంది.తెలంగాణ ప్రజల తరపున సోనియా గాంధీ కి ధన్యవాదాలు తెలుపుతున్నా అని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.ఏడేళ్ల కాలంలో తెలంగాణ ప్రజల ఆంకాంక్షకు అనుగుణంగా పాలన సాగడం లేదు. విభజన హామీలను కేంద్రం లోని బీజేపీ ని అడిగే ధైర్యం కేసీఆర్ కు లేదు.కోవిడ్ విషయంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి వైఫల్యం చెందాయి. మెడికల్ మౌళిక సదుపాయాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి వైఫల్యం చెందింది. రోమ్ తగలబడుతుంటే..నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించిన చందంగా కేసీఆర్ తీరు ఉంది. కోవిడ్ ట్రీట్మెంట్ కోసం పక్కనున్న ఏపీ,తమిళనాడు మాదిరిగా అమలు చేయాలని కోరిన పట్టించుకోవడం లేదు.ఏడేళ్ల లో తెలంగాణ సమాజానికి ఇచ్చిన ఏ హామీలు నెరవేర్చలేదు అని తెలిపారు.
ప్రభుత్వం లో ఉన్న ఖాళీ లను భర్తీ చేయకుండా నిరుద్యోగులను మోసం చేశారు. నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి రెండున్నర ఏళ్లు గడిచిన స్పందన లేదు. తెలంగాణ ప్రభుత్వం లో అవినీతి తారస్థాయికి చేరింది. 2023లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేలా కార్యకర్తలు సమిష్టి గా కృషి చేయాలి అని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారతీయులకు భారత రాయబార కార్యాలయం కీలక సూచనలు
- కువైట్లో చిన్నారుల కోసం ‘ఫ్రీడమ్ ఫ్రమ్ గాడ్జెట్స్’ కార్యక్రమం
- షార్జాలో ఇంధన వాసనపై ఆందోళన వద్దు.. పరిస్థితి అదుపులోనే ఉంది: అధికారులు
- మక్కాలో అనుచిత చర్యల వీడియోపై తప్పుడు ప్రచారం.. స్పష్టం చేసిన హోలీ మాస్క్స్
- బహ్రెయిన్ రాజు హమద్తో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ భేటీ..
- బరాకా అణు విద్యుత్ కేంద్రం ఘటన పై యూఏఈ స్పందనకు IAEA ప్రశంసలు
- ఇరాన్ 75వేల మందిని హత్య చేసింది: ట్రంప్ సంచలన ఆరోపణలు
- దుబాయ్లో లగ్జరీ కార్లతో ఇన్సూరెన్స్ మోసం.. ఐదుగురికి జైలు శిక్ష
- WPL 2027 మినీ వేలం తేదీ ఖరారు..
- యూఏఈలో ఐదేళ్లలో రెట్టింపైన ప్రైవేట్ జెట్ రాకపోకలు..!!







