స్పూర్తి దాయకంగా కాజాస్ హెల్పింగ్ హ్యండ్స్ సేవలు: కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్
- June 02, 2021
విజయవాడ: కరోనా విపత్కర పరిస్ధితులలో స్వచ్ఛంధ సంస్దలు తగిన సేవానిరతితో ముందుకు రావాలని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ పిలుపునిచ్చారు. వ్యక్తుల మొదలు కార్పొరేట్ సంస్ధల వరకు అంతా తమకు తోచిన రీతిగా కరోనా బాధితులను అదుకునేందుకు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. నగరంలోని తాడిగడపకు చెందిన కాజాస్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ కరోనా రోగుల కోసం నూతనంగా సమకూర్చిన ఐదు ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్స్ ను విజయవాడ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బుధవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కాజాస్ హెల్పింగ్ హ్యండ్స్ చేపడుతున్న సేవా కార్యక్రమాలు స్పూర్తిదాయకంగా ఉన్నాయన్నారు. ఫౌండేషన్ అందిస్తన్న సేవలను సద్వినియోగం చేసుకుని, ఎక్కువ మందికి ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్స్ ఉపయోగపడేలా రోగులు సైతం సహకరించాలన్నారు. కాజాస్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫోండేషన్ ఛైర్మన్ కాజా చక్రధర్ మాట్లాడుతూ తాము సమకూర్చుకున్న ఐదు కాన్సన్ ట్రేటర్స్ ను రోగులకు ఏడు నుండి పది రోజుల కాలపరిమితితో పూర్తి ఉచితంగా అందిస్తామన్నారు. త్వరలోనే మరికొన్నింటిని సమకూర్చుకుని కరోనా పీడితులకు పెద్ద ఎత్తున సహకరించాలని భావిస్తున్నామన్నారు. సంస్ధ కోఛైర్మన్ కాజా రమణి మాట్లాడుతూ తమ సంస్ధ తరుపున గత పది రోజులుగా నిత్యం వంద మందికి ఉచితంగా ఆహారం ఆందిస్తున్నామని తెలిపారు. అవసరమైన వారికి ఇతర రూపాలలో సైతం సహాయం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. కార్యక్రమంలో భాగంగా జిల్లా పాలనాధికారి చేతుల మీదుగా నూజివీడుకు చెందిన తిరుపతిరావు, వీరపనేని గూడెంకు చెందిన రాంబాబు లకు ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్స్ ను అందించారు. కార్యక్రమంలో పౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.

తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్‌ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!
- ఖతార్‌లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్‌లో భారీ వర్షాలు..!!
- ఇరాన్‌పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!







