మే లో 'కబాలి'.....
- March 06, 2016
శత్రువులపై కన్నెర చేసే సింహం.. ఆపదలో ఉన్నవారికి సహాయం చేసే ఆపద్బాంధవుడు.. సమాజం కోసం పాటుపడే మంచి సంఘ సంస్కర్త... టోటల్‌గా మంచితనానికి చిరునామా కబాలి. ఈ మాఫియా డాన్ లక్ష్యం ఏంటి? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. టైటిల్ రోల్‌లో రజనీకాంత్ హీరోగా పా. రంజిత్ దర్శకత్వంలో 'కలైపులి' ఎస్. థాను నిర్మిస్తున్న 'కబాలి' ఫస్ట్ లుక్‌కి భారీ ఎత్తున స్పందన లభించిన విషయం తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందిన ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.ఈ సందర్భంగా 'కలైపులి' ఎస్. థాను మాట్లాడుతూ - ''రజనీకాంత్‌తో సినిమా నిర్మించాలన్న నా కల ఈ చిత్రంతో నెరవేరింది.మంచి కథ, కథనాలతో రూపొందిన ఈ చిత్రంలో ఆయన గెటప్ ప్రత్యేక ఆకర్షణ అవుతుంది. రంజిత్ మంచి స్టయిలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. ఏప్రిల్ మొదటి వారంలో టీజర్‌ను, రెండో వారంలో పాటలను, వేసవి కానుకగా మేలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం'' అని చెప్పారు. రాధికా ఆప్టే, ధన్సిక, కిశోర్, జాన్ విజయ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు: సాహితి, సంగీతం: సంతోశ్ నారాయణ్, పాటలు: సిరివెన్నెల, చంద్రబోస్, అనంతశ్రీరామ్, కెమెరా: మురళి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: దేవి-శ్రీదేవి సతీశ్.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







