బ్రహ్మ దర్శకత్వంలో సూర్య, జ్యోతిక దంపతులు చిత్రం
- March 06, 2016
జాతీయ ఉత్తమ దర్శకుడు బ్రహ్మ దర్శకత్వంలో సూర్య, జ్యోతిక దంపతులు చిత్రం చేయనున్నారన్నది తాజా సమాచారం. కుట్రం కడిదల్ చిత్రం పలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో అవార్డులు,రివార్డులు అందుకున్న చిత్రం.అంతే కాదు దర్శకుడు బ్రహ్మకు జాతీయ అవార్డును అందించిన చిత్రం ఇది. మరో విశేషం ఈ దర్శకుడికిది తొలి చిత్రం కావడం. మొదటి చిత్రాన్ని నూతన తారలతో తెరకెక్కించి వారి నుంచి సహజత్వంతో కూడిన నటనను రాబట్టిన బ్రహ్మ తదుపరి చిత్రానికి సిద్ధమయ్యారు.ఇక్కడ మరో విశేషం ఏమిటంటే ఈ చిత్రానికి నటీనటులు సూర్య, జ్యోతిక పనిచేయనుండడం. వివరంగా చెప్పాలంటే బ్రహ్మ దర్శకత్వంలో నటుడు సూర్య తన 2డీ ఎంటర్టెయిన్మెంట్ పతాకంపై నిర్మించనున్న ఈ చిత్రంలో ఆయన అర్ధాంగి జ్యోతిక ప్రధాన పాత్రను పోషించనున్నారన్నది కోలీవుడ్ సమాచారం.ఈమె సుదీర్ఘ విరామం తరువాత వివాహనంతరం 36 వయదినిలే చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఆ చిత్రం విశేష ప్రేక్షకాదరణ పొందింది. అయితే ఆ తరువాత మంచి కథ కోసం ఎదురు చూస్తున్న జ్యోతికను ద ర్శకుడు బ్రహ్మ చెప్పిన కథ బాగా ఇంప్రెస్ చేసిందని, ఆ కథలో నటించడానికి ఆమె అంగీకరించినట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనున్నట్లు తెలిసింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







