చిక్కుడు ఆవకాయ
- June 02, 2015
కావలసిన పదార్ధాలు:
- చిక్కుడుకాయలు - 6 కప్పులు
- ఆవపిండి - 2 టీ స్పూన్లు
- మెంతి పొడి - 1 టీ స్పూను
- నూనె - 1 కప్పు
- కారం - 2 టీ స్పూన్లు
- ఉప్పు - తగినంత
- చింతపండు గుజ్జు - 3 టీ స్పూన్లు
- కరివేపాకు - 4 రెబ్బలు
- ఆవాలు - 1 టీ స్పూను
- ఎండుమిర్చి - 4
- పసుపు – చిటికెడు
చేయు విధానం:
- చిక్కుడుకాయల్ని శుభ్రంగా కడిగి ముక్కలుగా చేసి పది నిమిషాలు ఎండలో ఆరనివ్వాలి.
- పాన్ లో 2 టీ స్పూన్ల నూనె వేసి చిక్కుడుకాయ ముక్కల్ని వేయించాలి.
- ఇప్పుడు చింతపండు గుజ్జు వేసి మరికాసేపు వేయించాలి.
- ఈ మిశ్రమం చల్లారాక కారం, ఉప్పు, ఆవపిండి, పసుపు, మెంతి పొడి వేసి కలపాలి.
- మిగిలిన నూనెను పాన్ లో వేసి ఎండుమిర్చి, ఆవాలు, కరివేపాకు వేసి తాలింపు చేసి పచ్చడిలో కలిపితే చిక్కుడు ఆవకాయ తయార్.
- ఇది పదిహేను రోజులు నిల్వ ఉంటుంది.
------ వై.పార్వతి, హైదరాబాద్.
తాజా వార్తలు
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..
- షార్జాలో ఎతిహాద్ రైల్ స్టేషన్కు మూడు కొత్త బస్సు మార్గాలు







