ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్ కాంబినేషన్ లో సినిమా
- June 02, 2015
నందమూరి ఫ్యామిలీలో ఓ భారీ మల్టీస్టారర్ తెరకెక్కనుందనే వార్త గత కొన్నాళ్ళనుంచి తెగ హల్చల్ చేస్తోంది. తాజాగా ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్ కాంబినేషన్ ఓ మల్టీస్టారర్కోసం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రముఖ కథారచయిత వక్కంతం వంశీ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా మారనున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్‌రామ్ ఈ సినిమాను స్వయంగా నిర్మించనున్నారని అంటున్నారు. వక్కంతం వంశీ చెప్పిన పవర్ఫుల్ కథ ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్ ఇద్దరికీ నచ్చిందని, వారిద్దరూ వెంటనే సినిమాను ఓకేచేశారని తెలుస్తోంది. ఎన్టీఆర్‌కు వక్కంతం వంశీ తాజాగా టెంపర్ లాంటి సూపర్‌హిట్ సినిమాను అందించిన విషయం తెలిసిందే! కళ్యాణ్‌రామ్ నిర్మాణంలో తెరకెక్కిన కిక్-2 ఈనెలలోనే విడుదలవుతున్న విషయం తెలిసిందే. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్‌లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







