మనసే సాక్షి
- June 02, 2015
వయసు మీద పడుతున్నకొద్దీ
మనిషికి మృత్యు భయం
మొదలవుతుంది
చుట్టూ ప్రకృతి ఉన్నా
మనిషి దాని నుండి
పాఠాలు నేర్చుకోడు
తెల్లని మబ్బు
నల్లగా మారి
బరువెక్కి వర్షించి
తేట పడుతుంది
తన ధర్మాన్ని
తాను నేరవేర్చానని
సంతృప్తి పడుతుంది
చెట్టు మొక్కగా
మొదలై
మహా వృక్షంగా
శాఖోపశాఖాలుగా
విస్తరిస్తుంది
తొలిరోజుల్లో
నీటికోసం ఆర్తి చెందినా
బలాన్ని పుంజుకున్నాక
గాలి వేగాన్ని
జడి వానల్నీ
తట్టుకుంటుంది
చేతనైనంత మేరకు
ప్రపంచానికి
సేవ చేస్తుంది
కాయలనూ
పండ్లనూ
విరగకాసి
అడగకుండానే
ఇస్తుంది
రాళ్ళు విసిరిన
చేతులకు కూడా
గాయపడిన
ఫలాలని అందిస్తుంది
ఒంటిని వలిచి
బెరడును ఇస్తుంది
కొమ్మలపై
పిల్లలకూ పక్షులకూ
సేద చేకూరుస్తుంది
వయసు మళ్ళాక
శక్తి ఉడిగాక
ఖరీదైన కలపగా
జీవితాన్ని
సార్ధకం చేసుకుంటుంది
మనిషి మాత్రం
తన కోసమే
బ్రతుకుతాడు
'తన' వలయంలోనే
తనువు చాలిస్తాడు
దీర్ఘ నిద్ర
మాట సరే!
ప్రతిరాత్రీ
నిదురిస్తాడుకదా!
తానెవరికైనా
ఆ రోజున మంచి చేశాడా?
అలా అని ఆలోచించాడా?
ప్రకృతి ధర్మమైన
వార్ధక్యాన్ని మృత్యువునీ
ఎందుకు నిరసిస్తాడు?
భగవంతుడిని
పూజించాడో లేదో!
వదిలేద్దాం!
ఆఖరి క్షణాలలోనైనా
సాటి మనిషికి
సాయం పడితే
ఆ ఆఖరి క్షణాలు
అతన్ని గురించి
మంచి జ్ఞాపకాలుగా
మిగిలిపోతాయికదా!
--- డా|| మాదిరాజు రామలింగేశ్వర రావు, మచిలీపట్నం.
తాజా వార్తలు
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..
- షార్జాలో ఎతిహాద్ రైల్ స్టేషన్కు మూడు కొత్త బస్సు మార్గాలు







