పని ప్రాంతాల్లో తనిఖీలు మొదలు పెట్టిన మినిస్ట్రీ ఆఫ్ లేబర్

- June 10, 2021 , by Maagulf
పని ప్రాంతాల్లో తనిఖీలు మొదలు పెట్టిన మినిస్ట్రీ ఆఫ్ లేబర్

మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ లేబర్, సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వీడియోలపై స్పష్టతనిచ్చింది. పలు ప్రైవేటు సెక్టార్ కంపెనీల్లో ఉల్లంఘనలకు పాల్పడిన వలసదారులైన ‘వర్క్ ఫోర్స్’ని కార్యాలయాల నుంచి తొలగించే దిశగా అధికారులు చేపడుతున్న తనిఖీలకు సంబంధించిన వీడియోలవి. అయితే, ఆ వీడియోలు పాతవనీ, కానీ.. అందులోని విషయాల పట్ల అవగాహన కలిగేలా వీటి గురించి ప్రచారం నిర్వహఇంచడం మంచి పనేనని మినిస్ట్రీ పేర్కొంది. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తనిఖీ టీమ్స్.. తనిఖీలు నిర్వహించేందుకు సిద్ధంగా వున్నాయని, ఉల్లంఘనుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని అథారిటీస్ పేర్కొన్నాయి. ఆయా వీడియోలు ఎప్పటివన్నది తేల్చడం కష్టమైన ప్రక్రియగా అథారిటీస్ అభివర్ణించాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com