వేడి వేడి 'టీ'
- June 03, 2015
మన భారతీయులు సీజన్ తో సంబంధం లేకుండా వేడి వేడి టీ మరియు కాఫీలను త్రాగుతుంటారు. అది ఒక అలవాటుగా...ఉదయం నిద్రలేవగానే టీ త్రాగిన తర్వాత మిగిలిన దినచర్య ప్రారంభమౌతుంది. అయితే వర్షకాలంలో టీ లేడా కాఫీని త్రాగినప్పుడు ఆ మజాయే వేరుగా ఉంటుంది. మరి వేసి కాలంలో కూడా మన ఇండియన్ వేడి వేడి త్రాగుతుంటారు. మరి ఇది వేసవిలో ఆరోగ్యకరమేనా?ఒక రకంగా ఆరోగ్యకరమే అని చెప్పాలి ఎందుకంటే టీ శరీరాన్ని చల్లబరుస్తుంది. టీలో వివిధ రకాల టీలు గ్రీన్ టీ, బ్లాక్ టీ, హేర్బల్ టీ మరియు ఇతర రకాల టీలు కూడా ఉన్నాయి. ఈ టీలన్నింటిలోనూ అనేక ఆరోగ్యప్రయోజనాలున్న విషయం మనకు తెలిసిందే... వేసవి సీజన్ లో అల్లం టీ మీరు తీసుకొన్నట్లైతే అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. వేసవి సీజన్ లో ఎండవేడికి మీరు భయపడుతున్నట్లైతే, అటువంటి భయాలేమి పెట్టుకోకుండా నిరభ్యంతరంగా మీకు నచ్చిన టీని మీరు త్రాగవచ్చు. రీసెంట్ గా జరిపిన కొన్ని పరిశోధనల ప్రకారం వేసవి సీజన్ లో వేడి వేడి టీ త్రాగడం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదని నిర్ధారించారు . మరియు ఇలాంటి వేడి వాతావరణంలో టీ శరీర ఉష్ణోగ్రతను చల్లబరచడం మాత్రమే కాదు ఇది అనేక రకాల హెల్త్ బెనిఫిట్స్ ను కూడా అందిస్తుంది. గుర్తించుకోవల్సిన విషయం: టీలో కానీ, కాఫీలో కానీ, కెఫిన్ అధికంగా ఉంటుంది కాబట్టి, మితంగా తీసుకోవడం ఆరోగ్యానికి అన్ని రకాల శ్రేయస్కరం. మరి సమ్మర్లో వేడి టీ త్రాగడం వల్ల ప్రయోజనాలేంటో చూద్దాం... వేసవిలో, వేడి వాతావరణంలో కూడా టీ త్రాగితే ఆరోగ్యానికి ఎలాంటి దుష్ప్రభావం ఉండదు. శరీరాన్ని చల్లబరుస్తుంది . యూకెలో జరిపిన పరిశోధనల ప్రకారం ఐస్ టీ శరీరం యొక్క ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. అదేవిధంగా హాట్ టీ శరీరం యొక్క ఉష్ణోగ్రతను క్రమంగా తగ్గించి శరీరంను పూర్తిగా చల్లబరుస్తుంది. కొన్ని పరిశోధనల ప్రకారం టీలో ఉండే కెఫిన్ శరీరాన్ని చల్లబరుతుంది. మొత్తం జీవక్రియలను క్రమబద్దం చేసి, చురుకుగా పనిచేయడానికి సహాయపడుతుంది. ఒక కప్పు టీ మీ శరీరాన్ని నేచురల్ కూలింగ్ సిస్టమ్ కలిగి ఉంటుంది. అంతర్గతంగా శరీరాన్ని చల్లబరచడానికి లాజికల్ రీజన్ బయట వేడికి శరీరం వేడుకుతున్నప్పుడు టీ వల్ల శరీరంలోని అవయవాలు చల్లబడటం ప్రారంభమవుతుంది. దీన్నే కూలింగ్ సిస్టమ్ అంటారు. ఒకకప్పు టీ త్రాగిన తర్వాత దప్పకి అనేది ఉండదని కొంత మంది చెబుతుంటారు. మరికొంత మంది టీ త్రాగిన తర్వాత దప్పిక ఎక్కువగా ఉంటుందని చెబుతారు. అంతే కాదు, డీహైడ్రేషన్ తగ్గిస్తుంది. టీ ఒక సీక్రెట్ సాలివ. ఇది నోట్లో ఎక్కువ లాలాజలం ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. పెక్టిన్, అమినో యాసిడ్స్, మరియు షుగర్ కంటెంట్ అధికంగా ఉండటం వల్ల ఇలా జరగుతుంది . అందువల్లే నోరు హైడ్రేషన్లో ఉంటుంది.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







