భారత్ లో కరోనా కేసుల వివరాలు

- June 21, 2021 , by Maagulf
భారత్ లో కరోనా కేసుల వివరాలు

న్యూ ఢిల్లీ: భారత్ లో క‌రోనా కేసులు క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతున్నాయి.88 రోజుల త‌రువాత అత్య‌ల్ప‌స్థాయిలో కేసులు న‌మోద‌య్యాయి.కేంద్రం తాజాగా క‌రోనా బులిటెన్‌ను విడుద‌ల చేసింది.ఈ బులిటెన్ ప్ర‌కారం, గ‌డిచిన 24 గంట‌ల్లో భారత్ లో 53,256 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో భారత్ లో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 2,99,35,221కి చేరింది. 

ఇందులో 2,88,44,199 మంది కోలుకొని డిశ్చార్జ్‌కాగా, 7,02,887 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.  ఇక‌, గ‌డిచిన 24 గంట‌ల్లో భారత్ లో క‌రోనాతో 1,422 మంది మృతి చెందారు. దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 3,88,135 మంది క‌రోనాతో మృతి చెందారు.ఒక్క‌రోజులో దేశంలో 78,190 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.ఇక ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో 28,00,36,898 మందికి వ్యాక్సిన్ అందించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com