హైదరాబాద్: అంబేద్కనగర్‌లో డబుల్ బెడ్రూం ఇండ్లు ప్రారంభించిన కేటీఆర్
- June 26, 2021
హైదరాబాద్: నగరంలోని అంబేద్కనగర్‌లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను మంత్రులు కేటీఆర్, మహముద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ కలిసి శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత రెడ్డితో పాటు పలువురు కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు. నగర వాసుల కోసం ప్రభుత్వం రూ.28కోట్లతో 330 డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మించిన విషయం తెలిసిందే. ఒక్కో ఇంటిపై రూ. 8.50 లక్షలు ఖర్చు చేసి సకల సదుపాయాలతో కూడిన విలాసవంతమైన ఇండ్లను నిర్మించింది. ఈ మేరకు మంత్రి ఇండ్లను ప్రాంభించారు. అనంతరం లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేసి, ఇండ్ల తాళాలు అందజేశారు. ఈ సందర్భంగా ఫొటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. అంతకు ముందు డబుల్ ఇండ్ల ప్రారంభోత్సవానికి వచ్చిన కేటీఆర్‌కు స్థానికులు ఘన స్వాగతం పలికారు. డప్పుచప్పులు, బోనాలతో ఆహ్వానించారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. అంబేడ్కర్ నగర్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఇంత అద్భుతమైన ఇండ్లు నిర్మించి ఇస్తారని అనుకోలేదని స్థానికులు చెబుతున్నారు. ఇదే స్థలంలో ప్రయివేటు అపార్ట్మెంట్ కట్టి ఉంటే కోటిన్నర అయి ఉండేదని, కానీ ఒక్క పైసా తీసుకోకుండా సీఎం కేసీఆర్ ఇండ్లు నిర్మించి ఇచ్చారు అని ఆడబిడ్డలు చెబుతున్న మాటలతో గుండె సంతోషంతో ఉప్పొంగిపోయింది అని కేటీఆర్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కూలిన మిలిటరీ హెలికాప్టర్: ఆరుగురు మృతి
- ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమరం!
- యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో కీలక పరిణామం..
- గల్ఫ్‌లో ఇరాన్ ప్రతీకారం..అమెరికా రాడార్ వ్యవస్థలు ధ్వంసం
- ఇరాన్ దాడులు..పబ్లిక్ హెల్త్ పై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన..!!
- పిల్లిని రక్షించడానికి ప్రాణాలను పణంగా పెట్టిన వ్యక్తి..!!
- దమ్మామ్ మీదుగా కైరోకు.. కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- వెహికల్ నాయిస్ లిమిట్స్, మోడిఫికేషన్ పై హెచ్చరిక జారీ..!!
- జర్మన్ విదేశాంగ మంత్రితో GCC దేశాల మినిస్టర్స్ భేటీ..!!
- ఇరాన్ సైనిక అటాచీలను బహిష్కరించిన సౌదీ అరేబియా..!!









