దుబాయ్: గర్భిణిలకు కూడా వ్యాక్సినేషన్ ప్రారంభం
- June 30, 2021
దుబాయ్: గర్భిణిలకు కూడా కోవిడ్ 19 వ్యాక్సినేషన్ ప్రారంభించినట్లు దుబాయ్ ఆరోగ్య శాఖ ప్రకటించింది. జులై 29 నుంచి దుబాయ్ లోని అన్ని డీహెచ్ఏ వ్యాక్సిన్ సెంటర్లలో గర్భిణిలకు వ్యాక్సిన్ అందుబాటులో ఉందని తెలిపింది. అయితే..వ్యాక్సిన్ తీసుకోవాలని అనుకుంటున్న వారు డీహెచ్ఏ యాప్ ద్వారాగానీ వాట్సాప్ నెంబర్ 800342 ముందస్తుగా రిజిస్టర్ చేసుకోవటం ద్వారా అపాయింట్ తీసుకోవటం తప్పనిసరి. వ్యాక్సినేషన్ ప్రక్రియలో అవాంతరాలు తలెత్తకుండా సరిపడా డోసులను ఇప్పటికే భద్రపరిచినట్లు డీహెచ్ఏ అధికారులు తెలిపారు. అయితే..వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ దృష్ట్యా వారి ఆరోగ్య పరిస్థితులను ముందస్తుగానే తమ రెగ్యులర్ డాక్టర్ తో సమీక్షించుకోవాలని సూచించారు. ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్న గర్భిణిలు ముందస్తుగా వారి డాక్టర్‌ను సంప్రదించి తగిన సలహాలతో వ్యాక్సిన్ కు రావాలన్నారు. అంతేకాదు గర్భం దాల్చిన 13 వారాల తర్వాతే తొలి డోసు తీసుకోవటం మంచిదని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







