Oscar 2022: "ఆస్కార్" ఎంపికకి విద్యాబాలన్ ఏక్తాకపూర్ లకు ఆహ్వానం
- July 03, 2021
ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఆస్కార్ అవార్డు ఎంపిక కార్యక్రమానికి భారత చలన చిత్ర రంగం నుండి బాలీవుడ్ బొద్దుగుమ్మ విద్య బాలన్ మరియు ప్రముఖ నటి నిర్మాత ఏక్తా కపూర్ మరియు తన తల్లి శోభ కపూర్ కి ఆహ్వానం అందింది. ఈ మేరకు మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ & సైన్సు యొక్క అకాడమీ యొక్క "క్లాస్ అఫ్ 2021" తరపున నూతనంగా పాల్గొంటున్న నటులతో పాటు టాస్క్ మేనేజర్ లు మొత్తంగా 395 మంది పాల్గొననున్న ఈ కార్యక్రమానికి భారత్ నుండి ముగ్గురు మహిళలకి ఆహ్వానం అందింది. అంతే కాకుండా ప్రస్తుతం జరగబోతున్న ఈ కార్యక్రమంలో 43 శాతం మహిళలు ఉండటం గమనార్హం. గతంలో ఈ ఆస్కార్ వోటింగ్ కి భారత సినిమా రంగం నుండి అమితాబ్ బచ్చన్, ప్రియాంక చోప్రా, దీపిక పదుకొనే, సల్మాన్ ఖాన్, ఇర్ఫాన్ ఖాన్, ఐశ్వర్య రాయ్, అమీర్ ఖాన్ వంటి నటినటులతో పాటు నిర్మాతలు గౌతం గోస్ మరియు దాస్ గుప్తా లు హాజరయ్యారు. గతంలో 819 మందితో జరిపిన ఈ కార్యక్రమానికి ఈ సారి కరోన కారణాల దృష్ట్యా 395 మంది తో మాత్రమే నిర్వహించబోతున్నట్లు తెలుస్తుంది.
ఇక ఇప్పటికే "డర్టీ పిక్చర్" సినిమాతో జాతీయ అవార్డు పొందిన విద్య బాలన్ పరిణిత, పా వంటి చిత్రాలల్లో తన నటనతో ఆకట్టుకున్న విద్య బాలన్ తాజాగా అమిత్ మసుర్కర్స్ దర్శకత్వం వహించిన షేర్నీ లో నటించిన ఈ చిత్రం ఇటివలే ఒక ప్రముఖ ఓటిటి ఛానల్ లో విడుదల అయింది. ఇక ఏక్తా కపూర్ "వన్స్ అపాన్ టైం ఇన్ ముంబై" చిత్రాలతో పాటు "డ్రీం గర్ల్" సినిమాలతో మంచి పేరు తెచ్చుకుంది. ఇక తన తల్లి శోభ కపూర్ నిర్మాతగా ఉడ్తా పంజాబ్, డర్టీ పిక్చర్ వంటి చిత్రాలని నిర్మించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







