కోయంబత్తూరు విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత

- July 03, 2021 , by Maagulf
కోయంబత్తూరు విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత

కోయంబత్తూరు: తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు విమానాశ్రయంలో భారీ ఎత్తున అక్రమంగా తరలిస్తున్న బంగారం పట్టుబడింది.ఈ కేసులో ఆరుగురు ప్రయాణికులను డిఆర్ఐ అదికారులు అరెస్ట్ చేశారు.స్వాధీనం చేసుకున్న బంగారం విలువ రూ.2.99 కోట్లు ఉంటుందని అదికారులు తెలిపారు.వివరాల్లోకి వెళ్తే..షార్జా నుంచి వచ్చే విమానంలో అక్రమంగా బంగారం తరలిస్తున్నట్లుగా కోయంబత్తూరు విమానాశ్రయం అధికారులకు సమాచారం అందింది.వెంటనే అలర్ట్ అయిన అధికారులు.. విమానాశ్రయంలో తనిఖీలు చేపట్టారు.షార్జా నుంచి ఎయిర్ అరేబియా విమానంలో దిగిన ప్రయాణికులను అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేశారు.ఆరుగురు ప్రయాణికులు తమ జీన్స్ ప్యాంట్‌లో,ఇన్నర్‌లో దాచిపెట్టి రహస్యంగా తీసుకువచ్చిన బంగారాన్ని గుర్తించారు.వెంటనే వారిని అదుపులోకి తీసుకున్నారు.వారి నుంచి 6 కిలోల 117 గ్రాము బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

మన్నంకట్టి అరుముగం, బజరుల్ రెహ్మాన్ హాజీ అబ్దుల్ హమీద్, ఎమయరాజ్ మాధవన్, ముబిన్ అహ్మద్ సులైమాన్,తిరుమూర్తి రాజేంద్రన్,హబీబ్ మరైకాయర్ సీని ఇబ్రహీంషా..ఈ ఆరుగురు నిందితులను కస్టమ్స్ ఎయిర్ ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్ అధికారులకు అప్పగించినట్లు డిఆర్ఐ అదికారులు తెలిపారు.కాగా, నిందితులంతా కేరళలోని విలుప్పురం, కడలూరు, రామనాథపురం,వెల్లూరు జిల్లాలకు చెందిన వారిగా గుర్తించారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.అయితే, వీరు అసలైన స్మగ్లర్లు కాదని, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో వీరు ఈ స్మగ్లింగ్‌కి ఒప్పుకున్నట్లు అధికారులు గుర్తించారు.

ఈ నిందితులు..దుబాయ్, షార్జాలో డ్రైవర్లు, నిర్మాణ కార్మికులు, మొబైల్ ఫోన్ మరమ్మతులుగా పనిచేస్తున్నారని అధికారులు తమ ఎంక్వైరీలో గుర్తించారు.అయితే, కరోనా సంక్షోభం కారణంగా ఉపాధి లేకపోవడంతో స్వగ్రామాలకు తిరిగి రావాలని నిర్ణయించుకున్నారు. ఇంతలో కొందరు వ్యక్తులు వీరిని సంప్రదించి, ప్రయాణ ఖర్చులను భరిస్తామని, బంగారాన్ని భారత్ కు అక్రమంగా రవాణా చేస్తే కమిషన్ కూడా ఇస్తామని ఆశ చూపారు.దీనికి ఆశపడిన వీరు..గోల్డ్ స్మగ్లింగ్‌కు ఒప్పుకున్నారు.కానీ, అధికారుల నుంచి తప్పించుకోలేకపోయారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com