శ్రీవారి ఆన్‌లైన్ టికెట్లను ఇప్పట్లో పెంచేది లేదు..
- July 03, 2021
తిరుమల: కరోనా వైరస్ తీవ్రత ఇంకా కొసాగుతూనే ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో తిరుమల శ్రీవారి ఆన్‌లైన్ టికెట్లను పెంచే ఉద్దేశం లేదని టీటీడీ పేర్కొంది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన తర్వాతే దీని గురించి ఆలోచిస్తామని టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ చైర్మన్, ఈవో కేఎస్ జవహర్‌రెడ్డి స్పష్టం చేశారు. దీంతో సర్వదర్శనం కోసం సామాన్య భక్తులు మరికొంత కాలం వేచి చూడక తప్పేలా కనిపించడం లేదు.
మరోవైపు,శ్రీవారి జిలేబీ, మురుకుల ప్రసాదం ధరలను టీటీడీ పెంచింది. శ్రీవారికి ప్రతి గురువారం నిర్వహించే తిరుప్పావడ సేవ సమయంలో జిలేబీతోపాటు మురుకులను నివేదిస్తుంటారు. తిరుప్పావడ టికెట్లు కొనుగోలు చేసి శ్రీవారి సేవలో పాల్గొనే భక్తులకు వీటిని ఇస్తుంటారు. వీటికి డిమాండ్ ఎక్కువగా ఉండడంతో రూ. 100గా ఉన్న ధరను రూ. 500కు పెంచింది. కాగా, చిన్న, పెద్ద లడ్డూలు, వడల ధరలను టీటీడీ ఇప్పటికే పెంచింది.
తాజా వార్తలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!







