ఒకరి ఐడీతో ఇంకొకరు: ఇరువురికీ జైలు

- March 09, 2016 , by Maagulf
ఒకరి ఐడీతో ఇంకొకరు: ఇరువురికీ జైలు


నైజీరియాకి చెందిన సెక్యూరిటీ గార్డ్‌, దుబాయ్‌లో జరిగిన ఎమిరేట్స్‌ రగ్బీ 7ఎస్‌ గేమ్‌ని చూసేందుకు తన స్నేహితుడి కోసం తన ఐడీ కార్డ్‌ని డూప్లికేట్‌ చేసిన కేసులో న్యాయస్థానం ఇద్దరికీ జైలు శిక్ష విధించింది. స్టేడియంలో తనిఖీల సందర్భంగా ఈ విషయం బయటపడింది. ఐడీ కార్డ్‌ని చూపించవలసిందిగా ఆ వ్యక్తిని సెక్యూరిటీ సిబ్బంది అడుగగా, అక్కడ అతను చెప్పిన వివరాలు, కార్డులో వివరాలకు మధ్య తేడా బయటపడింది. తన స్నేహితుడికి తన ఐడీ కార్డ్‌ని డూప్లికేట్‌ చేసి ఇచ్చిన మాట వాస్తవమేనని సెక్యూరిటీ గార్డ్‌ ఒప్పుకున్నాడు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com