తెలంగాణ: రెండు రోజుల పాటు ప్రభుత్వ వెబ్సైట్ల సేవలకు అంతరాయం
- July 08, 2021హైదరాబాద్: తెలంగాణలో రెండు రోజుల పాటు ఆన్లైన్ సేవలు నిలిచిపోనున్నాయి. ప్రభుత్వ ఉత్తర్వుల జారీ కూడా నిలిచిపోనుంది. హైదరాబాద్ గచ్చిబౌలిలోని రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ భవనంలోని రాష్ట్ర డేటా కేంద్రం (ఎస్డీసీ)లో కొత్త యూపీఎస్ యూనిట్ ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో ప్రభుత్వ వెబ్సైట్ సేవలకు అంతరాయం ఏర్పడుతుందని అధికారులు తెలిపారు.
రాష్ట్రంలో ఆన్లైన్ సేవలు అంతకంతకు పెరుగుతున్నాయి. అదే సమయంలో విద్యుత్ అంతరాయాలు కూడా ఏర్పడుతున్నాయి. దీంతో ప్రస్తుతం ఉన్న అన్ ఇంటరప్టబుల్ పవర్ సప్లై (యూపీఎస్) సామర్థ్యం సరిపోవడం లేదు. ఇది ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవడంతో దాని స్థాయిని పెంచాలని నిపుణులు ప్రతిపాదించారు. దీంతో కొత్త యూపీఎస్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రేపు రాత్రి 9 గంటల నుంచి 11వ తేదీ రాత్రి 9 గంటల వరకు ప్రభుత్వ వెబ్సైట్ల సేవలకు అంతరాయం ఏర్పడుతుందని పేర్కొన్న ప్రభుత్వం అన్ని శాఖలకు ఈ సమాచారాన్ని అందించింది.
తాజా వార్తలు
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్‌లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..