ఖతార్ తిరిగొచ్చేవారి కోసం ఎహ్తెరాజ్ యాప్ లో కొత్త సర్వీస్
- July 08, 2021
దోహా: విదేశాల నుంచి ఖతార్ తిరిగొచ్చే ప్రవాసీయుల ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేలా ఎహ్తెరాజ్ యాప్ సర్వీసులను మెరుగు పర్చింది ప్రభుత్వం.ఇన్నాళ్లు ఈ యాప్ లో ప్రీ రిజిస్ట్రేషన్ ఉండేది కాదు.కానీ, లేటెస్ట్ అప్ డేట్ తో ఆ చిక్కులు తొలిగిపోయాయి. ప్రవాసీయులు తమ ప్రయాణానికి ముందే యాప్ లో తమ హెల్త్ స్టేటస్ వివరాలతో ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.దాంతో హెత్త్ స్టేటస్ వెరిఫైయింగ్, క్వారంటైన్ నిబంధనలు, క్వారంటైన్ నుంచి ఎవరికి మినహాయింపు ఉంటుంది అనే ప్రయాణ నిబంధనలు తెలుసుకునే అవకాశం ఉంటుంది.అంతేకాకుండా ఖతార్ ఎంట్రీ ప్రాసెస్ కూడా ఆటోమెటిగ్గా జరిగిపోతుంది. క్యూలైన్లలో వేచిఉండాల్సిన అవసరం ఉండదు. జూన్ లోనే అప్ డేట్ అయిన ఎహ్తెరాజ్ యాప్ తో ఆ వ్యక్తి హెల్త్ కార్డ్ నెంబర్, చివరిసారిగా కోవిడ్ టెస్ట్ ఎప్పుడు చేయించుకున్నారు, టెస్ట్ రిపోర్ట్ వివరాలు ఉంటాయి. అంతేకాకుండా..సదరు వ్యక్తి కోవిడ్ బారిన పడితే అతను ఏ రోజున ఇన్ఫెక్ట్ అయ్యాడు..ఏ రోజున కోలుకున్నాడు..కోలుకునేందుకు ఎన్నాళ్ల
సమయం పట్టింది అనే వివరాలు కూడా ఉంటాయి.ఒకవేళ యాప్ లో రిజిస్టర్ అయిన వ్యక్తి రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకుంటే క్యూఆర్ కోడ్ చుట్టు గోల్డెన్ ఫ్రేమ్ ఉంటుంది. ఒక వేళ సదరు వ్యక్తి కోవిడ్ టెస్ట్ చేయించుకోకుంటే యాప్ లో అతని హెల్త్ కార్డ్ నెంబర్ వివరాలు డిస్ ప్లే కావు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- బహ్రెయిన్ కాఫీ ఫెస్టివల్లో విజయం..నేపాలీ బారిస్టాస్ కు సత్కారం..!!
- సౌదీ, జోర్డాన్ విదేశాంగ మంత్రులు భేటీ..!!
- మ్యాచ్ ఫర్ హోప్ 2026..యూట్యూబ్ స్టార్ మిస్టర్బీస్ట్ ఖరారు..!!
- షేక్ హమ్దాన్ ను కలిసిన ఎలోన్ మస్క్..!!
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!
- కొత్త OMR 1 నోటు జారీ చేసిన CBO ..!!
- అల్ అరీన్ రిజర్వ్ కు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేరు..!!







