‘శ్రీదేవి సోడా సెంటర్’ నుంచి సాంగ్ విడుదల చేసిన మెగాస్టార్
- July 09, 2021
హైదరాబాద్: వైవిధ్యమైన కథలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో సుధీర్ బాబు కి ప్రత్యేకత వుంది. ప్రేమకథాచిత్రమ్ లాంటి హర్రర్ కామెడి చిత్రం తో తెలుగు సినిమా ఇండస్ట్రి కి ట్రెండ్ క్రియొట్ చేశారు. భలేమంచి రోజు లాంటి విభిన్నమైన కథనం తో విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. నన్నుదోచుకుందువటే, సమ్మొహనం చిత్రాల తో యూత్ నే కాకుండా ఫ్యామిలి ఆడియన్స్ కూడా ఆకట్టుకున్నారు.
కథల విషయంలో కంగారు లేకుండా ప్రేక్షకుల అభిరుచి కి తగ్గట్టుగా చిత్రాలు చేస్తూ వెల్ టాలెంటెడ్ హీరోగా సుధీర్‌బాబు తన కెరీర్ ని కొనసాగిస్తున్నారు. అదేవిధంగా ప్రస్తుతం ఆయన చేస్తున్న చిత్రం శ్రీదేవి సోడా సెంటర్.. ఈ టైటిల్ ఎనౌన్స్ చేసిన దగ్గరనుండే ట్రెండ్ లో క్రేజ్ స్టార్టయ్యింది. విడుదలయ్యిన మెదటి లుక్ కి, ఆ తరువాత విడుదలైన గ్లిమ్స్ కి విపరీతమైన క్రేజ్ రావటం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్వర మాంత్రికుడు మణిశర్మ ట్యూన్ చేసిన మాస్ కా బాస్ సాంగ్ మందులోడా అంటూ సాగే పాటను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు.
ఫుల్ మాస్ ట్యూన్స్ ఇవ్వడంలో మణిశర్మది ఓ ప్రత్యేకమైన శైలి, అందుకు తగ్గట్లుగానే ప్రముఖ లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్ మందులోడా అంటూ సాగే మాస్ తీన్ మార్ లిరిక్స్ అందించారు దీంతో ఇప్పుడు ఈ పాట అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఈ పాట లిరికల్ వీడియోలో హీరో సుధీర్ బాబు వేసిన స్టెప్స్ కి అనూహ్య స్పందన లభిస్తుంది.
ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో నిర్మాతలు విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి 1978 పలాస చిత్రం ద్వారా బ్లాక్‌బస్టర్ మూవిని ట్రెండింగ్ సాంగ్ ని టాలీవుడ్ కి అందించిన కరుణకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. జీ మ్యూజిక్ కంపెనీ ద్వారా ఈ చిత్రం ఆడియో విడుదలైంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







