సమ్మర్ వర్క్ బ్యాన్ అమలు తీరుపై మంత్రి ఆకస్మిక తనిఖీలు
- July 17, 2021
బహ్రెయిన్: బహ్రెయిన్ వ్యాప్తంగా సమ్మర్ వర్క్ బ్యాన్ అమలు తీరును పరిశీలించేందుకు కార్మిక శాఖ మంత్రి జమీల్ హమైదన్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పలు నిర్మాణ రంగంలోని పలు వర్క్ సైట్లకు వెళ్లి కార్మికుల భద్రత కోసం ఆయా యాజమాన్యాలు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. తన పర్యటన తర్వాత సమ్మర్ వర్క్ బ్యాన్ అమలు తీరుపట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. వేసవి ఎండ తీవ్రత నుంచి కార్మికులను రక్షించేందుకు మధ్యాహ్నం వేళల్లో బహిరంగ ప్రాంతాల్లో పనులను నిషేధించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఆదేశాలను పలు సంస్థలు, యాజమాన్యాలు అమలు చేస్తున్న తీరును ఆయన ప్రశంసించారు. జులై తొలి నుంచి ఇప్పటివరకు బహ్రెయిన్ వ్యాప్తంగా 3,344 చోట్ల తనిఖీలు నిర్వహించగా కేవలం 15 సంస్థల్లోని, 26 మంది కార్మికులు వర్క్ బ్యాన్ రూల్స్ బ్రేక్ చేసినట్లు గుర్తించామన్నారు మంత్రి. అంటే మొత్తంగా 0.4 శాతం మేర నిబంధనల ఉల్లంఘన జరిగిందన్నారు. సమ్మర్ వర్క్ బ్యాన్ నిబంధన బ్రేక్ చేసిన వారికి మూడు నెలలకు మించకుండా జైలు శిక్ష, BD500 నుంచి BD 1,000 వరకు జరిమానా విధించనున్నట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- నిర్లక్ష్యంగా డ్రైవింగ్.. డ్రైవర్‌కు జైలు, కారును ధ్వంసం చేసిన కువైట్ అధికారులు
- అబుదాబిలో షఖ్‌బౌట్ బిన్ సుల్తాన్ వీధిలో మూడు రోజుల పాటు పాక్షిక రహదారి మూసివేత
- అంతర్జాతీయ బాండ్ల జారీతో కువైట్‌కు 3.25 బిలియన్ డాలర్లు
- షార్జాలో పోగొట్టుకున్న, యజమానులు క్లెయిమ్ చేయని వస్తువుల నిర్వహణపై కొత్త చట్టం
- సౌదీ అరేబియాలో 5 డ్రోన్లను అడ్డుకున్న సంకీర్ణ దళాలు..
- ఏపీలో ఎన్నికల పై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు..
- మొబైల్ ఫోన్ గొడవ..ఇద్దరి హత్యకు దారి
- దుబాయ్‌లో ఘనంగా స్పార్క్ మీడియా 5వ వార్షిక బతుకమ్మ సంబరాలు 2026
- సౌదీ అరేబియాలో భారతీయులకు భారత రాయబార కార్యాలయం కీలక సూచనలు
- కువైట్‌లో చిన్నారుల కోసం ‘ఫ్రీడమ్ ఫ్రమ్ గాడ్జెట్స్’ కార్యక్రమం







