హైదరాబాద్ విమానాశ్రయంలో నాలుగు నూతన ర్యాపిడ్ ఎగ్జిట్ ట్యాక్సీ వేలు ప్రారంభం

- July 19, 2021 , by Maagulf
హైదరాబాద్ విమానాశ్రయంలో నాలుగు నూతన ర్యాపిడ్ ఎగ్జిట్ ట్యాక్సీ వేలు ప్రారంభం
  • నూతన ర్యాపిడ్  ఎగ్జిట్ ట్యాక్సీవేలతో రన్ వే కెపాసిటీ పెంచడానికి మార్గం సుగమం 
  • రిహాబిలిటేషన్ వర్క్ అనంతరం ప్రాథమిక రన్ వే పున: ప్రారంభం
  • 98 % ఎయిర్ పోర్ట్ గ్రౌండ్ లైటింగ్ (AGL)ను LED లుగా మార్చిన హైదరాబాద్ విమానాశ్రయం

హైదరాబాద్: వేగవంతమైన, నిరాటంకమైన విమానాల రాకపోకల కోసం జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (GHIAL) 4 నూతన ర్యాపిడ్ ఎగ్జిట్ ట్యాక్సీవేలను (RET) ప్రారంభించింది. ఈ అదనపు RET లు ప్రస్తుతం ఉన్న రన్ వే సామర్థ్యాన్ని 36 నుండి 45 వరకు పెంచే లక్ష్యానికి తోడ్పడతాయి. ఈ ర్యాపిడ్ ఎగ్జిట్ ట్యాక్సీవేలతో పాటు, రిహాబిలిటేషన్ పనుల అనంతరం హైదరాబాద్ విమానాశ్రయం ప్రాథమిక రన్‌వేను కూడా విజయవంతంగా ప్రారంభించింది.

కొత్త రాపిడ్ ఎగ్జిట్ టాక్సీవేలు విమానాశ్రయ కార్యాచరణ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఈ RET లు విమానాలు రన్‌వేకు కొద్ది దూరం నుంచే ట్యాక్సీయింగ్ చేసే విధంగా రూపొందించబడ్డాయి. దీనివల్ల రన్‌వే  ఆక్యుపెన్సీ సమయం తగ్గి, తద్వారా రన్‌వే సామర్థ్యం పెరుగుతుంది. వీటితో పాటు, రిహాబిలిటేషన్  వల్ల పేవ్‌మెంట్ క్లాసిఫికేషన్ నెంబర్ (PCN) మరియు రన్‌వే యొక్క ఫ్రిక్షనల్ విలువలు పెరుగుతాయి, తద్వారా విమానాశ్రయం నుంచి వచ్చీపోయే విమానాల భద్రత పెరుగుతుంది.

వీటితో పాటు, GHIAL తన ఎయిర్‌సైడ్ లైటింగ్‌లో 98% (ఎయిర్‌ఫీల్డ్ సైనేజ్, టాక్సీవే సెంటర్‌లైన్ లైట్లు, రన్‌వే లైట్లు)  సమర్థవంతమైన LED లైటింగ్‌లుగా మార్చడం ద్వారా మరో హరిత మైలురాయిని చేరుకుంది. దీని వల్ల విద్యుత్ గణనీయంగా ఆదా అవడమే కాకుండా, కర్బన ఉద్గారాలు తగ్గుతాయి.రన్‌వే మరియు ఇతర ఎయిర్‌ఫీల్డ్ లైటింగ్‌లు ఎయిర్ పోర్టుల సురక్షిత కార్యకలాపాలకు కీలకం. కొత్తగా అమర్చిన ఎల్‌ఈడీ లైట్లు ప్రతికూల వాతావరణ పరిస్థితులలో కూడా ఎయిర్‌ఫీల్డ్స్‌ స్పష్టంగా కనిపించడానికి దోహదపడి, విమానాల సురక్షిత రాకపోకలకు సహకరిస్తాయి. ఈ ఏరోనాటికల్ గ్రౌండ్ లైటింగ్ (AGL) అప్‌గ్రేడేషన్ రన్‌వే రిహాబిలిటేషన్ పనుల్లో భాగంగా జరిగింది.

విమానాశ్రయ ప్రారంభం నుండి, GHIAL విమానాశ్రయం తన కార్యకలాపాలను పర్యావరణ అనుకూల, సుస్థిర విధానాలలో నిర్వహించడానికి కట్టుబడి ఉంది. వివిధ ఇంధన పరిరక్షణ విధానాల ద్వారా గణనీయమైన ఇంధన ఆదాను సాధిస్తోంది. దీనిలో భాగంగా, గతంలో టెర్మినల్ భవనం మరియు కార్యాలయాల వద్ద హాలోజన్ లైటింగును LED లకు మార్చారు. GHIAL తన కృషిని ఇప్పుడు ఎయిర్‌సైడ్ కార్యకలాపాలకు కూడా విస్తరించింది.

పైన పేర్కొన్న అన్ని రిహాబిలిటేషన్ పనులు మరియు AGL అప్‌గ్రేడేషన్‌తో ప్రపంచ స్థాయి ఎయిర్‌ఫీల్డ్ మౌలిక సదుపాయాలను కలిగిన హైదరాబాద్ విమానాశ్రయం అన్ని రకాల విమానాల రాకపోకలకు, సురక్షితమైన, సమర్థవంతమైన ప్రయాణ కార్యకలాపాలకు అనువుగా ఉంది. 

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com