టీటీడీపీ అధ్యక్షుడిగా బక్కని నర్సింహులు
- July 19, 2021
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడిగా బక్కని నర్సింహులును పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు.ఇంతకాలం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఎల్.రమణ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రమణ స్థానంలో నర్సింహులును చంద్రబాబు నియమించారు. బక్కని నర్సింహులు మాదిగ సామాజికవర్గానికి చెందినవారు. 1994-99 మధ్య కాలంలో షాద్ నగర్ ఎమ్మెల్యేగా బాధ్యతలను నిర్వహించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకానికి సంబంధించిన చర్చ సందర్భంగా ఒకానొక సమమయంలో సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి పేరు కూడా ప్రస్తావనకు వచ్చింది. అయితే వ్యక్తిగత కారణాల వల్ల అధ్యక్ష బాధ్యతలను స్వీకరించడానికి ఆయన ఆసక్తి చూపలేదు. దీంతో బక్కని నర్సింహులుకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను అప్పగించారు.
మరోవైపు రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపికైన సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ను బక్కని నర్సింహులు మద్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బక్కనిని లోకేశ్ అభినందించారు. సమస్యల పరిష్కారం కోసం ప్రజల పక్షాల నిలబడి పోరాటం చేయాలని అన్నారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







