చికెన్ కరాహి
- March 10, 2016
కావలసిన పదార్థాలు: చికెన్:అరకిలో (ముక్కలుగా చేసుకోవాలి), టమోటాలు: మూడు(ముద్ద చేసుకోవాలి), అల్లం:చిన్న ముక్క(సన్నగా తరిగి పెట్టుకోవాలి), అల్లం వెల్లుల్లి ముద్ద: రెండు టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి: నాలుగు లేక ఐదు(ముక్కలుగా చేసుకోవాలి), ధనియాల పొడి: టేబుల్ స్పూను, జీలకర్ర పొడి: టేబుల్ స్పూను, పసుపు: చిటికెడు, కారం: టేబుల్ స్పూను, ఉప్పు: రుచికి సరిపడ, నూనె: పావుకప్పు,కొత్తిమీర: కొద్దిగా
తయారీ విధానం: మందపాటి గిన్నెలో నూనె పోసి కాగిన తరువాత అల్లం వెల్లుల్లి ముద్ద వేసి సన్నని మంట మీద వేయించుకోవాలి. అనంతరం ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి ఓ నిమిషం పాటు వేయించుకుని తరువాత చికెన్ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర వేసి బాగా కలిపి సన్నని మంట మీద ఉడికించాలి. చికె న్ కొద్దిగా ఉడికిన తరువాత టమోటా ముద్ద, ఉప్పు, కారం, పసుపు వేసి అవసరం అనుకుంటే కొద్దిగా నీరు పోసి ఉడికించాలి. కూర ముద్దగా అవుతున్న సమయంలో అల్లం ముక్కలు, కొద్దిగా కొత్తిమీర జతచేసి దింపేయాలి.
తాజా వార్తలు
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..
- షార్జాలో ఎతిహాద్ రైల్ స్టేషన్కు మూడు కొత్త బస్సు మార్గాలు







