'సభకు నమస్కారం'లో మరో యంగ్ హీరో
- July 22, 2021
హైదరాబాద్: చాలాకాలం తరువాత “నాంది”తో మంచి విజయాన్ని అందుకున్న అల్లరి నరేష్ ప్రస్తుతం సినిమాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు.ఇక నుండి కంటెంట్ ఉన్న చిత్రాలలో మాత్రమే నటించాలని చూస్తున్నాడు.ఇటీవల అల్లరి నరేష్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నెక్స్ట్ మూవీని ప్రకటించారు. “సభకు నమస్కారం” పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా అల్లరి నరేష్ కెరీర్లో 58వ చిత్రం.ఈ సెటైరికల్ పొలిటికల్ థ్రిల్లర్ కు దర్శకుడు సతీష్ మల్లంపాటి దర్శకత్వం వహిస్తున్నారు.మహేష్ ఎస్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమాను ప్రకటిస్తూ విడుదల చేసిన పోస్టర్లో అల్లరి నరేష్ లుక్ విభిన్నంగా ఉండడంతో అందరి దృష్టి ఈ సినిమాపై పడింది.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్ బయటకు వచ్చింది. ఇందులో అల్లరి నరేష్ తో పాటు మరో యంగ్ హీరో కూడా నటించబోతున్నాడట. సమాచారం ప్రకారం “అరవింద సమేత”లో చక్కని నటనను కనబర్చిన ప్రతిభావంతుడైన యువ నటుడు నవీన్ చంద్ర “సభకు నమస్కారం”లో ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో నవీన్ చంద్ర నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేయనున్నట్లు వినికిడి. అతను ప్రధాన విరోధి పాత్ర పోషిస్తాడని అనుకోవచ్చు.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్‌పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్‌ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్‌లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్‌లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్‌లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







